ఢిల్లీ నుండి మోడీ వచ్చి ఒక్క మాట చెప్పారా.. రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడారా.? మనల్ని చూసి ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్‌రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారని, అమిత్ షా, మోడీ వచ్చారు… పేదల కోసం, అభివృద్ధి కొసం ఒక్క మాట చెప్పలేదని ఆయన మండిపడ్డారు. రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారని, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వడ్లు కొన…
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం తరుఫున ఘన స్వాగతం పలికారు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిఖత్ జరీన్‌కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఆణిముత్యాలు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో ఈ ఘనత సాధించిందని…
ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం సాధించి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్. అయితే నేడు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరుపున క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నాకు ఇంతటి…
సీఎం కేసీఆర్ గతంలో కూడా ప్రళయం సృష్టిస్తా.. పీఎంను దేశం నుండి తరిమేస్తా.. బీజేపీ నీ బంగళా ఖాతంలో కలిపేస్తానంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓవైసీ నేను కలిసి దేశమంతా పర్యటిస్తా అన్నారు… ఫెడరల్ ఫ్రంట్ అన్నారు ముందు మీ పార్టీలో గుణాత్మక మార్పు రావాలి, కేసీఆర్ వ్యవహారంలో గుణాత్మక మార్పు రావాలి అంటూ కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని విమర్శించే నైతిక హక్కు…
మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి సీఎం కేసీఆర్, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ పేద ప్రజలకు 15 లక్షలు ఇస్తామన్న మోడీని ఇవ్వమని ఎందుకు అడగలేదు బండి సంజయ్ అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా 2కోట్ల ఉద్యోగాల గురించి మోడీని ఎందుకు అడగలేదని ఆయన అన్నారు. ఒక్కరోజు కూడా గుడికి పోని బండి సంజయ్ శివలింగల మీద మాత రాజకీయమా… మతాల పేరుపై ప్రజలను బీజేపీ రెచ్చగొడుతుంది ప్రజలు…
హైదరాబాద్‌లో మరో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహిత మహిళను ప్రేమించమని వెంటపడి వేధింపులకు గురిచేశాడు. అతడి ప్రేమను నిరాకరించడంతో పగ పెంచుకున్న ఆ ఉన్మాది ఒంటిరిగా వెళ్తున్న సదరు మహిళపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నూరా భాను అనే వివాహిత మహిళను హబీబ్ అనే వ్యక్తి గత సంవత్సరకాలంగా ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో.. అతడి ప్రేమను…
సీఎం కేసీఆర్ విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సబితా ఇంద్రారెడ్డి పలు స్కూళ్లలో జరుగుతున్న అభివృద్ధిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయాలని చూస్తున్నామని, అందులో భాగంగా విడతల వారీగా స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఆమె వెల్లడించారు. నిధులు కూడా కేటాయించామని, హాలియా స్కూల్ లో 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి అంటే స్కూల్‌కి కలర్…
ప్రధాని మోడీ నేడు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. అయితే ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. టీఆర్ఎస్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మోడీ మాట్లాడుతూ.. ఎంతో మంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని.. అలాంటి త్యాగాలతో వచ్చిన తెలంగాణ ఏ ఒక్క కుటుంబం కోసమో కాదన్నారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీ…
ప్రధాని మోడీ హైదరాబాద్‌లో నేడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్లో హెచ్సీయూకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీజేపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అయితే బేగంపేట ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో… పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజల పేరుందని, తెలంగాణ…