Ustaad Bhagat Singh: రిస్క్ చేస్తున్న హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్, ఎందుకంటే గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్ళీ అదే మేజిక్ రిపీట్ చేసేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక స్పెషల్ ఎపిసోడ్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి సీన్ ఒక ట్రెండ్ సెట్టర్. పోలీస్ స్టేషన్‌లో రౌడీలతో హీరో చేయించిన ఆ హంగామా థియేటర్లను ఊపేసింది. ఆ తర్వాత ఎంతో మంది దర్శకులు అదే ప్యాటర్న్‌ను ఫాలో అయినప్పటికీ, హరీష్ శంకర్ క్రియేట్ చేసిన ఆ ఇంపాక్ట్‌ను ఎవరూ అందుకోలేకపోయారు. అయితే తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం హరీష్ శంకర్ ఆ అంత్యాక్షరి ఎపిసోడ్‌కు ఒక మోడ్రన్ టచ్ ఇచ్చి, సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read:Couple Friendly: ప్రభాస్ పుష్ గట్టిగా పని చేసినట్టుందే!
Also Read
- Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
- Karikala First Look: సందీప్ కిషన్ 'కరికాల' ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్‌లో ఎప్పుడూ చూడలే..
- Aishwarya Rajesh : ఫ్లాప్‌లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
- Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్... ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన 'ఇచ్ఛాధారి నాగిన్'..
ఈసారి కేవలం పాటలు, డ్యాన్సులతోనే సరిపెట్టకుండా.. వినోదంతో పాటు మరిన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. పాత మ్యాజిక్‌ను రిపీట్ చేయడం హరీష్ శంకర్‌కే పెద్ద సవాల్ అయినప్పటికీ, ఈసారి అంతకు మించి ఉండేలా పక్కాగా ప్లాన్ చేశారట. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా, వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను గుర్తు చేసేలా ఈ సీన్ ఉండబోతోందని సమాచారం. అయితే ఒక ట్రెండ్ సెట్టర్‌ను మళ్ళీ అదే స్థాయిలో ఆవిష్కరించడం కత్తి మీద సామే. కానీ, హరీష్ శంకర్‌కు పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ మీద పూర్తి పట్టు ఉంది. ‘గబ్బర్ సింగ్’లో ఆ సీన్ ఎంత నేచురల్‌గా పండిందో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కూడా అదే స్థాయి వినోదాన్ని పండించేందుకు చిత్ర యూనిట్ శ్రమిస్తోంది. ఈ ఎపిసోడ్ కనక వర్కవుట్ అయితే, థియేటర్లు మరోసారి బ్లాస్ట్ కావడం ఖాయం. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ఈ తాజా అప్‌డేట్ మెగా అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈసారి భగత్ సింగ్ అంత్యాక్షరితో ఎలా ఎంటర్‌టైన్ చేస్తారో చూడాలి!
- Tags
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!