తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈ భోగి పండుగ భోగ భాగ్యాలను అందించాలని, సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని, కనుమ పండుగ కన్నుల పండుగై మీ ఇంటిలో సుఖసంతోషాలు, ఆనందానురాగాలు పంచాలని ఆ అమ్మ వారిని వేడుకుంటున్నానన్నారు. అంతేకాకుండా హిందువుల ఆత్మ గౌరవ ప్రతీక, భారతీయుల 5 శతాబ్దాల నిరీక్షణ అయోధ్య రామ…
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి సారి కైట్ ఫెస్ట్ జరుపుకుంటున్నామని, అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలన్నారు. టూరిజం శాఖ నీ దేశం లోనే అగ్రగామి తీసుకెలెందుకు మినిస్టర్ కష్టపడుతున్నాడని, ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కొరుకుంటున్నామన్నారు. టూరిజం ఆదాయం పెరగాలని…
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని అన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలు.. అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో…
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, లోహపు పూతతో కూడిన ‘మాంజా’ దారం విద్యుదాఘాతానికి మరియు సరఫరాలో ట్రిప్పింగ్‌కు కారణమయ్యే అవకాశం ఉందని, సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ స్థాపనల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) ప్రజలకు సూచించింది. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, TSSPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ ఫరూఖీ ప్రజలు విద్యుదాఘాతానికి కారణమయ్యే లోహపు పూతతో కూడిన దారాలను ఉపయోగించడం…
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి మరొకరిని బరిలోకి దించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో బాలశౌరి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ వయా మిర్యాలగూడ -విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆయన కార్యాలయంలో శనివారం…
వికారాబాద్ అనంతగిరిలో ఘాట్ రోడ్డులో ఆర్టీసి బస్సు బ్రేక్ ఫేల్ అవ్వడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. అయితే.. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హైదరాబాద్ నుండి తాండూర్ వైపుగా వెళ్తున్న ఆర్టీసీ ప్రైవేట్ టీఎస్ 34 టీఎ 6 363 బస్సు బ్రేకులు ఫెయిలవడంతో అనంతగిరి ఘాట్ రోడ్డులో అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరికి కాలు విరగగా మిగతా 8…
ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 5 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టును సృష్టించాలనే లక్ష్యంతో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో వ్యయం చేయబోతోందని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జలసౌధలో నీటి పారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున వృధా మరియు అనుత్పాదక వ్యయాన్ని సమీక్షా…
కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్నాటక సోప్ & డిటర్జెంట్స్ లిమిటెడ్ (కెఎస్‌డిఎల్) మైసూర్ శాండల్ సబ్బును నకిలీ వెర్షన్లను తయారు చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శనివారం అరెస్టు చేశారు. మలక్‌పేట పోలీసులు నకిలీ ఉత్పత్తులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సహా సుమారు రూ.2 కోట్ల విలువైన మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 1,800 150 గ్రాముల సబ్బు ప్యాక్‌లతో కూడిన 20 డబ్బాలను, 9,400 75 గ్రాముల సబ్బుతో కూడిన 47 అట్టపెట్టెలు, 150 గ్రాములు మరియు 75…
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తమ సొంతూళ్లకు వెళ్లేందుకు నగర వాసులు పయనమయ్యారు. దీంతో నగరంలో భారీ ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దీంతో నగరంలో ప్రధాన బస్టాండ్లు MGBS, JBS బస్టాండ్లతో పాటు వివిధ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. భారీగా ప్రయాణికుల రద్దీ ఉండటంతో ఆర్టీసీ సిబ్బంది కంట్రోల్ చేయలేకపోతున్నారు. అధిక రద్దీతో బస్సులు కదులుతున్నాయి. ప్రమాదకరంగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బస్టాండ్‌కి బస్ వచ్చిన ఒక్క నిమిషంలోనే ఫుల్ అయిపోతున్నాయి బస్సులు. రద్దీని కంట్రోల్ చేసేందుకు సిటీ…