సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి సారి కైట్ ఫెస్ట్ జరుపుకుంటున్నామని, అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలన్నారు. టూరిజం శాఖ నీ దేశం లోనే అగ్రగామి తీసుకెలెందుకు మినిస్టర్ కష్టపడుతున్నాడని, ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కొరుకుంటున్నామన్నారు. టూరిజం ఆదాయం పెరగాలని కోరుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. టూరిజం శాఖకి రవాణా శాఖ నుండి మంచి తోడ్పాటు అందిస్తామని తెలుపుతున్నామన్నారు.
అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. దేశ విదేశాల నుండి వచ్చిన కైట్ ఫ్లయర్స్ అందరికీ వెల్కమ్ చెప్పారు. 16 దేశాల నుండి 40 మంది,దేశం లోని ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది కైట్ ఫ్లయర్స్ వచ్చారని, పంట ఇంటికి వచ్చిన సందర్భంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటామని, గ్రామాల్లో ఆ సందడి తగ్గిందన్నారు. అందరినీ భాగస్వాములను చేయడం కోసం ఈ కైట్ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ కి 15 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నామని, వచ్చే సంవత్సరం నుండి మండల్లాలో కూడా కైట్ ఫెస్టివల్ జరుపుతామన్నారు.
కరోనా వల్ల మూడు సంత్సరాలు కైట్ ఫెస్టివల్ కి గ్యాప్ వచ్చిందని, రానున్న రోజుల్లో ఆట పాట ల వైపు కూడా పిల్లకి ఇంట్రెస్ట్ కలిగిలే కార్యక్రమలు ఉంటాయన్నారు. ఏ పండగ అయిన అందరూ పాల్గొనాలని, తెలంగాణ ప్రాముఖ్యత నీ ప్రపంచం అంతటా వ్యాపించే లా కార్యక్రమాలు ఉంటాయన్నారు. అన్ని రకాల సంపద మన దగ్గర ఉన్నప్పుడు మన గొప్పదనాన్ని చాటాలని, పర్యాటకులను రప్పించి ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు.