శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. 41.4 కోట్ల విలువ చేసే 5.92 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సౌత్ ఆఫ్రికా లేడి కిలాడి హ్యాండ్ బ్యాగ్‌లో హెరాయిన్ గుర్తించిన కస్టమ్స్ అధికారులు.. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాంబీయా నుండి హైదరాబాద్ వచ్చిన సౌత్ ఆఫ్రికా జాతీయురాలి వద్ద డ్రగ్స్ పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. హ్యాండ్ బ్యాగేజ్లో దాచిన హెరాయిన్…
ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ భవన్లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు .భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావలా వంతుకు మీంచి అమలు చేయలేరని, మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడన్నారు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన…
ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబాకు సాంప్రదాయ పూజలతో ఆదివారం మహా క్రతువు మొదలైంది. ఆదిలాబాద్ కేస్లాపూర్లో నాగోబా జాతర తేదీలను నిర్ణయించారు మేస్త్రం వంశీయులు. పుష్యవాస అమావాస్యను పురస్కరించుకొని ఫిబ్రవరి 9 నుండి మొదలయ్యే కేస్లా పూర్ నాగోబా జాతర ఉత్సవాల కోసం ఆదివారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ సన్నిధిలో మెస్రం వంశీయులు సమావేశమై పాదరక్షలు లేకుండా కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి నది హస్తినమడుగు ప్రాంతానికి బయలుదేరారు. సుమారు…
అయోధ్యలో సోమవారం జరగనున్న శ్రీరాముని విగ్రహం ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్ర సమితికి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఆదివారం వెల్లడించారు. ఫలితంగా, ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్కు ప్రాతినిధ్యం ఉండదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు బీజేపీ చెబుతున్న నేపథ్యంలో, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని కవిత మీడియా ప్రతినిధులతో అన్నారు. అయితే, శ్రీరాముడు ఒక వ్యక్తికి లేదా సంస్థకు చెందినవాడు…
పేద ప్రజల కోసమే భారత్ వికాసిత్ భారత్ సంకల్పయాత్ర అని అన్నారు జనగామ జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ.. దేశంలో ఈ పథకం ద్వారా మూడు కోట్ల ఇల్లు మంజూరు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఈ పథకం అమలు చేయడం జరిగింది, తెలంగాణలో ఇంకెవరైనా ఈ పథకం ద్వారా లబ్ధి పొందని వారు మరోసారి కూడా లబ్ధి పొందవచ్చన్నారు ఆర్కే సింగ్. పేద ప్రజలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకు ఆరోగ్యం, అక్షయ…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ – కాంగ్రెస్ కూటమికి మద్య పోరాటమన్నారు వరంగల్ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. బీఆర్ఎస్ పార్టీ ఎవరితో ఉన్నారు.? అని ఆయన ప్రశ్నించారు. ఒకటీ రెండో చోట్ల బీఆర్ఎస్ గెలిస్తే ఇండియా కూటమికి సహకరిస్తారా..? బీజేపీ కి మద్దతిస్తారా..? అని ఆయన అన్నారు. ఎంఐఎం పార్టీ బీజేపీ అంతా మత ఉన్మాదం కలిగిన పార్టీలా మేం భావించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని బ్రతికించాలి… ఆ పార్టీ దారి తప్పితే దానికి వైద్యం…
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం కొత్త తండాలో సీఎస్ఆర్ నిధుల నుండి 25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ కార్యాలయం భవనం, 13 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రంను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ మరియు ఎంపీటీసీ జడ్పీటీసీల హక్కులను హరించిందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు నిధులు ఇవ్వకుండా, వారిని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి…
బీఆర్ఎస్ను తుడిచిపెట్టేందుకు ప్రధాని మోదీ , సీఎం రేవంత్‌రెడ్డి కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్కు మోడీకి గానీ, రేవంత్‌రెడ్డికి గానీ భయం లేదని , తెలంగాణ ప్రజల గొంతుకగా పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ , సీనియర్ జర్నలిస్టు…
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు సన్నాహాలు తుది దశలో ఉన్నాయి. ఈలోగా, రాంలాలా ముఖం యొక్క మొదటి చిత్రం శుక్రవారం వెలువడింది. ఈ రాంలాలా విగ్రహం 5 సంవత్సరాల నాటిది, దీనిని కర్నాటక ప్రత్యేక రాయితో తయారు చేశారు. రాంలాలా విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. విగ్రహం పిల్లల రూపంలో ఉంటుంది మరియు సుమారు 1800 కిలోగ్రాముల బరువు ఉంటుంది. రాంలాలా ముఖం యొక్క మొదటి చిత్రం బయటకు వచ్చిన తర్వాత, దేశవ్యాప్తంగా…
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు.. ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు ఎదుర్కుంటున్న సమస్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో అద్దె బస్సుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అద్దె బస్సుల యజమానులు స్వాగతించారు.. కాని తమ బస్సుల పై పడుతున్న భారాన్ని మంత్రి దృష్టికి…