Azharuddin: మనీలాండరింగ్ కేసులో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మెన్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. 20 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు సంబంధించినది. నేడు హైదరాబాద్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరు కావాలని అజారుద్దీన్‌ను ఆదేశించింది. ఆయనకి ఇదే తొలి సమన్లు. Virat-Anushka: ఇది ట్రయిల్ బాల్.. కోహ్లీకే రూల్స్ నేర్పించిన అనుష్క! నవ్వు ఆపుకోవడం కష్టమే ఇదివరకు అజారుద్దీన్…
మా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో డిసెంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వ నిర్ణయాలు క్లారిటీగా చెప్పారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా, మూసీ లాంటి కార్యక్రమాల గురించి చెప్పారని, పేద,మధ్యతరగతి కుటుంబ అవసరాలు తెలుస్కొని అవి తీర్చడానికే మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మాది పేద ప్రజల కోసం పని చేసే ప్రభుత్వమని, మూసీ నది ప్రక్షాళన…
తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడానికి వెంటనే జిల్లాలను సందర్శించాలని ప్రత్యేక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి నియమించారు. Sree Vishnu: మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనేదే కథ : హీరో శ్రీవిష్ణు ఇంటర్వ్యూ కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి,…
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి ప్రతీక.. బతుకమ్మ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను చాటుకుందన్నారు. తర తరాలుగా మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణమైన బతుకమ్మ పండుగ, తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు…
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం మినిట్స్ విడుదల చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లో 2017లో- MRDCL సమావేశాల్లో చర్చించిన అంశాలు, 2018 – ప్రాజెక్ట్ చర్చల ప్రారంభం, MRDCL అధికారులతో 09.07.2018న సమావేశం నిర్వహించినట్లు పేర్కొంది. నదీ గర్భంలో ఉన్న ఆక్రమణలను లెక్కించాలని నిర్ణయించారని, బఫర్ జోన్ 1 నెల వ్యవధిలో నది సరిహద్దును సక్రమంగా ఫిక్సింగ్ చేస్తుందని తెలిపారు. పునరావాసం, భూమి కోసం ఒక నివేదిక తయారు…
తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టిందన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా అని, అలాంటి నూలు పోగు దండను ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా వేశా అని ఆయన అన్నారు. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని, అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని…
గత శుక్రవారం సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో 5 వ తరగతి చదువుతున్న మైనర్ బాలిక పై జరిగిన అత్యాచార ఘటనపై హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా పోలీస్ కమిషనర్ అనురాధతో ఫోన్ లో మాట్లాడి నిందితుడిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. బాధిత బాలికకు పునరావాస ఏర్పాట్లు చేయాల్సిందిగా, అలాగే బాలికకు కస్తూరిబా గాంధీ పాఠశాలలో చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన సూచించారు. ఘటనపై పారదర్శకంగా…
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన “మూటలో మహిళా శవం” హత్య కేసు వివరాలను షాద్ నగర్ ఏసీపీ ఎన్.సిహెచ్ రంగస్వామి మీడియాకు వెల్లడించారు. గత నెల 27వ తేదీ రాత్రి అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళ కన్నా భాగ్యలక్ష్మి అలియాస్ లక్ష్మి (40) హత్యకు గురైంది. ఆమె శవాన్ని ఓ బ్లాంకెట్ లో చుట్టి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫరూక్ నగర్ శ్రీనివాస కాలనీలో ఓ డ్రైనేజ్ పక్కన మూటగట్టి…
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో కుర్చీల కొట్లాట జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. మీ కుర్చీల కోట్లలో మమ్ములను ఎందుకు లాగుతారన్నారు. బీజేపీలో ఈటలను అయినా ఇంకెవ్వరినైనా అధ్యక్షునిగా పెట్టుకోండి నాకెందుకని, నన్ను విమర్శ చేస్తే పడను.. నేను ఎక్కడ ఉంటే అక్కడ మంత్రిని అవుతా అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో నేను ఉన్నాను… మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు పెట్టారు…
కాంగ్రెస్ పార్టీ హామీలపై ఆందోళనను వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ గ్యారంటీ పేరుతో మోసపూరిత హామీలు చెపుతోందని, “గ్యారంటీ” అనే పేరుతో ప్రజలను మోసపెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మోసపూరిత హామీలతో ఓట్లు వేసుకుని గెలిచాక, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అనేక కారణాలు చెప్పి, నిర్లక్ష్యంగా చుక్కలు చూపిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో ఈ గ్యారంటీలను అమలు చేయడం కాకుండా, “హైడ్రా” అనే పేరుతో ఇతర అంశాలకు దృష్టి…