పచ్చని పల్లెల్లో , తండా లలో మద్యం చిచ్చు పెడుతుండటంతో.. తండా యువకులు మద్యం పై పోరు ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సంగ్య తండా బెల్టు షాపుల మూలంగా. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మద్యం విక్రయాలు 24 గంటల పాటు జరుగుతున్నాయి.ఒక్కటైన తండా వాసులు తండా లో గల్లీ తిరుగుతూ మద్యం విక్రయాలను నిషేధిస్తూ ర్యాలీ నిర్వహించారు.ఆరు వందల జనాభా కలిగిన చిన్న తండాలోనే ఐదు బెల్ట్ షాపులు ఈ…
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఆస్తి పంపకాలు చేసుకుందామని పంచాయతీ పెట్టించి, పంచాయతీలో ఇద్దరి మధ్య చిలికి చిలికి గాలివానై ఆగ్రహం పట్టలేని కొడుకులు కన్న తండ్రి పై, అతని రెండో భార్యపై కత్తులతో దాడి చేయగా ఒకరు మరణించగా, మరొకరు తీవ్ర గాయాలు అయిన సంఘటన జిల్లాలో జరిగింది. వేములవాడ పట్టణానికి చెందిన మల్లయ్యకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య బాలవ్వ కు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు, రెండో భార్య పద్మకు కూడా ఒక్క…
సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ 33 జిల్లాల తహశీల్దార్లతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురి కావొద్దని, కలెక్టర్ అనుమతితోనే తహశీల్దార్ల పై కేసులు నమోదు చేయాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తహశీల్దార్ల బదిలీలపై…
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
హైడ్రా వేరు, మూసీ కార్యక్రమం వేరని, హైడ్రా చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయిందని, మూసీ నది సంరక్షణ కోసం ఇప్పుడు మూసీ కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి పొన్నం. మూసీ పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ఇల్లు కూడా ఇప్పటివరకు కూల్చలేదని,…
మూసీ బాధితులను ఆదుకుంటాం.. ఎవరిని విస్మరించమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎన్టీఓల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నామని, రివర్ బెల్ట్ లో.. భూసేకరణ చట్టం అమలు చేస్తామన్నారు శ్రీధర్ బాబు. బీఆర్ఎస్లో కొందరు నేతలు బూతద్దం లో పెట్టీ చూపెట్టే పనిలో ఉన్నారని, FTL దాచిపెట్టి అమ్మిన బిల్డర్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులు… వారిపై ఒత్తిడి తెచ్చింది ఎవరన్నది బయట పెడతామని, త్వరలో హెల్ప్ డెస్కులు.. హైడ్రా.. మూసీ పరివాహక ప్రజల…
తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎంఎఫ్సీ) ఐటీ, హెల్త్‌కేర్ సహా వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ కోర్సులను ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలను అక్టోబర్ 4లోగా తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించాలి. శిక్షణ ఉపాధి , ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ పథకం ప్రకారం TMFC ఈ కోర్సులను అందిస్తుంది. ఈ కార్యక్రమం కింద, ముస్లింలు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు , జైనులతో సహా కమ్యూనిటీలకు చెందిన విద్యావంతులైన , నిరుద్యోగ యువత వివిధ…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వారిద్దరినీ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇస్మాయిల్, మహ్మద్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు బీజేపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర తిరుగుతుండగా వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్ఓ) వారిని పట్టుకుని భౌతికంగా తనిఖీ చేసిన తర్వాత మంగళ్‌హాత్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి వారి పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో గోషామహల్ ఎమ్మెల్యే…
బియ్యం ఎగుమతులపై కేంద్రం శనివారం ఆంక్షలను సడలించడంతో తెలంగాణలోని వరి రైతులు ఆనందించడానికి కనీసం ఒక కారణం ఉంది. బాస్మతీయేతర తెల్ల బియ్యం విదేశీ రవాణాపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం తొలగించింది , టన్నుకు కనీస ఎగుమతి ధర (MEP) $490 విధించింది. అదనంగా, అధికారులు తక్షణమే అమలులోకి వచ్చేలా విదేశీ విక్రయాలపై పన్నును 20 శాతం నుండి 10 శాతానికి తగ్గించారు. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై నిషేధం జూలై 20, 2023 నుండి అమలులోకి…
హైడ్రా విషయంలో పేదలకు భరోసా, భద్రత ఇస్తే సమస్య ఉండదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైడ్రా పేదల విషయంలో పునరావాసం కల్పించాలని, కూల్చివేతలు తప్పు అనడం లేదన్నారు శ్రీనివాస్ గౌడ్. అందరి పట్ల హైడ్రా సమానంగా వ్యవహరించాలని, అధికారులు తొందర పడొద్దన్నారు. వచ్చేది మా ప్రభుత్వమని, ఏ ప్రభుత్వం భవనాలకు అనుమతి ఇచ్చిన తప్పే అని ఆయన అన్నారు. మాపై కోపం పేదలపై చూపొద్దని, పేదలకు భరోసా కల్పించాలన్నారు. ప్రజలు వ్యతిరేకం అయితే అనుకున్న…