పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ఒక రీమేక్ చిత్రానికి ఇంతగా హైప్ రావడం భీమ్లా నాయక్ వలనే అయ్యిందంటే అతిశయోక్తి కాదు. మేకర్స్ కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టే సినిమాను…
నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు చిన్న తెరపై కూడా వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞతో దూసుకుపోతున్నాడు. ఇంతకుముందు తన అభిమానులు, ప్రేక్షకులు ఎవ్వరూ చూడని తనలోని మరో యాంగిల్ ను పాపులర్ సెలెబ్రిటీ టాక్ షో “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ద్వారా చూపిస్తున్నారు. తెలుగు ఓటిటి ‘ఆహా’ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ఈ షో అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటోంది. ఈ షోకు వీక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. హోస్ట్ బాలయ్య చేస్తున్న హంగామా, ఫన్ అందరినీ…
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తోన్న టాక్ షో అన్ స్టాపబుల్ వరుసగా రెండు ఎపిసోడ్స్ ప్రసారమయిన తరువాత కొంత గ్యాప్ వచ్చింది. వరుసగా ప్రసారం కావడానికి ఇదేమైనా సీరియలా.. సెలబ్రేషన్.. అంటూ బాలకృష్ణ తన ప్రచార వాక్యాలతో మూడో ఎపిసోడ్ ను అందరినీ అలరిస్తూ ఆరంభించారు. ఈ మూడో ఎపిసోడ్ నవ్వుల పువ్వులు పూయించడమే ప్రధాన లక్ష్యంగా కనిపించింది. గతంలో రెండు ఎపిసోడ్స్ కంటే మిన్నగా ఈ మూడో ఎపిసోడ్ లో…
నందమూరి బాలకృష్ణ హోస్టుగా “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” ఫుల్ స్టాప్ లేకుండా దూసుకెళ్తోంది. షోకు వచ్చిన అతిథులు బాలయ్యతో కలిసి చేస్తున్న హడావిడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నవంబర్ 4న ‘ఆహా’లో ప్రీమియర్ అయినప్పటి నుండి రికార్డు స్థాయిలో ఈ షోకు వ్యూస్ వస్తుండడం విశేషం. మొదటి ఎపిసోడ్ లో మంచు కుటుంబం… మోహన్ బాబు, లక్ష్మి మంచు, విష్ణు మంచు, సెకండ్ ఎపిసోడ్ లో నేచురల్ స్టార్ నాని పాల్గొనగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా…
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ఈ మూవీతో సుబ్బు చెరుకూరి దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీస్తున్నారు. మోనోఫోబియాతో బాధపడుతున్న అప్ కమింగ్ రచయిత తన జీవితానికి ప్రమాదం ఎర్పడినప్పుడు ఎలా అధిగమించి బయటపడ్డాడన్నదే కథాంశం. శ్రీరామ్ మడ్డూరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఆరంభం అయింది. యస్…
యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాచర్ల నియోజక వర్గం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎంఎస్ రాజశేఖర్ దరకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇక ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం కామెడీ కింగ్ బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారు చిత్ర బృందం. పారితోషికం కూడా బాగానే ముట్టజెప్పారట. అయితే బ్రహ్మ్మనందం తీరుపై నితిన్ ఫైర్ అయ్యాడంట.. షూటింగ్ టైం కి బ్రహ్మీ రాలేదని, ఆయన వలన సమయం వృధా అయ్యిందని నితిన్…
2021 సంవత్సరానికి గాను డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కా రాలను నిర్వాహకులు ప్రకటించారు. విశిష్ట పురస్కారాలు ..భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలు డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లకు దక్కింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గ పద్మజా, ప్రముఖ సినీ పాత్రికేయుడు ఎస్‌వీ రామారా వులకు విశేష సేవా పురస్కారం దక్కింది.త్వరలోనే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం పేర్కొన్నారు. అయితే, 2020 సంవత్సరానికి సైతం అవార్డులను ప్రకటించామని,లాక్‌డౌన్…
సీనియర్ నటుడు, గోపీకృష్ణ మూవీస్ అధినేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్య నటుడు, గిన్నిస్ బుక్ విజేత బ్రహ్మనందం ఇటీవల ఓ ఆధ్యాత్మిక బహుమతిని ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా అందించారు. కేంద్రమంత్రిగానూ గతంలో బాధ్యతలను నిర్వర్తించిన కృష్ణంరాజు. సాయిబాబా భక్తులు. ఆయన తన కుమార్తెలకు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి అని బాబా పేరు కలిసి వచ్చేలా పెట్టారు. కృష్ణంరాజులోని ఆ ఆధ్యాత్మిక కోణాన్ని గుర్తించిన బ్రహ్మానందం కరోనా సమయంలో తాను…
‘పంచతంత్రం’ అనే ఆసక్తికర టైటిల్ తో ‘ఇవి మీ కథలు, మన కథలు’ అంటూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మన ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు హర్ష పులిపాక. బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం…
(సెప్టెంబర్ 23న ‘దూకుడు’కు పదేళ్ళు) పది సంవత్సరాల క్రితం మహేశ్ బాబు హీరోగా రూపొందిన ‘దూకుడు’ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. విదేశాలలోనూ విజయదుందుభి మోగించింది. మహేశ్ అభిమానుల ఆనందాన్ని అంబరమంటేలా చేసింది. దాదాపు ఐదు సంవత్సరాలు తమ హీరో భారీ విజయం కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ‘దూకుడు’ మహదానందం పంచింది. ఈ చిత్రంతో మహేశ్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల తొలిసారి కలసి పనిచేశారు. ఈ సినిమాలోనే మహేశ్ తో సమంత మొదటి…