2021 సంవత్సరానికి గాను డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కా రాలను నిర్వాహకులు ప్రకటించారు. విశిష్ట పురస్కారాలు ..భారత్ బయోటెక్ సీఎండీ, జేఎండీలు డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లకు దక్కింది. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గ పద్మజా, ప్రముఖ సినీ పాత్రికేయుడు ఎస్‌వీ రామారా వులకు విశేష సేవా పురస్కారం దక్కింది.త్వరలోనే పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ కన్వీనర్ పాతూరి నాగభూషణం పేర్కొన్నారు. అయితే, 2020 సంవత్సరానికి సైతం అవార్డులను ప్రకటించామని,లాక్‌డౌన్ ఆంక్షల వల్ల ప్రదానోత్సవ సభ నిర్వహించ లేకపోయినట్టు ఆయన తెలిపారు.
ఇప్పుడు 2021 అవార్డులను కూడా ప్రకటించామని.. రెండేళ్ల అవార్డులను ఒకే వేదికపై త్వరలో అందిస్తామని పాతూరి నాగభూ షణం పేర్కొన్నారు. రామినేని ఫౌండేషన్ కుటుంబ సభ్యులే సొంత ఖర్చుతో ఈ అవార్డులను అందజేస్తారు. 1999లో రామినేని ఫౌండే షన్‌ను ఏర్పాటు చేవారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలను చేపడుతుంది.