బాలీవుడ్ బెబో కరీనాకపూర్ పై నెటిజన్లు ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్న ‘సీత’ అనే పౌరాణిక సినిమాలో సీత పాత్రలో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో సీతమ్మగా నటించడానికి ఆమె తన సాధారణ రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువగా డిమాండ్ చేసిందని, ఈ సినిమా కోసం కరీనా 12 కోట్ల రూపాయలను పారితోషికంగా అడిగిందని, అంతేకాకుండా ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలన్నీ పూర్తయ్యాకనే ‘సీత’ చిత్రాన్ని మొదలు పెడతానని…