ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటే… కాపీ క్యాట్ అని హేళన చేసినవారే ఇప్పుడు ఆయనకు బ్రహ్మ రధం కడుతున్నారు. ఎన్నో ట్రోల్స్ ని ఎదుర్కొన్నా థమన్ కృంగిపోకుండా నిలబడి విజయాలను అందుకుంటున్నాడు. ఇటీవల థమన్ సంగీతం అందించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ గా మారుతోంది. ఇక ఇటీవల థమన్ సంగీతం అందించిన అఖండ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అఖండ విజయంలో థమన్ పాత్రే ఎక్కువ ఉందంటే అతిశయోక్తి కాదు..…
నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా అఖండ విజయాన్ని నమోదు చేసుకొని దూసుకుపోతోంది. ప్రస్తుతం ఏ థియేటర్ వద్ద చూసినా జై బాలయ్య అరుపులు మారుమ్రోగిపోతున్నాయి. బోయపాటి – బాలయ్య కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక తాజాగా ఈ సినిమా చూడడానికి నిజమైన అఘోరాలు రావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ పట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్లో ఇద్దరు అఘోరాలు సందడి…
ప్రస్తుతం ఎక్కడ విన్నా ‘అఖండ’ గురించే చర్చ.. భారీ అంచనాల నడుమ గురువారం విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకొని భారీ రికార్డులను కొల్లగొట్టే దిశలో పడిగెడుతుంది. థియేటర్లు ఓపెన్ అయ్యాకా విడుదలై మంచి వసూళ్లు రాబట్టి మిగతా సినిమాలకు అఖండ నమ్మకమనే గేట్లను ఎత్తింది. ఇక ఈ సినిమా విజయంపై టాలీవుడ్ మొత్తం సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమా చూసిన పలువురు స్టార్ హీరోలు తమ స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.…
తెలుగు చిత్రసీమలో ఓ హీరోతో ఓ దర్శకుడు మూడు వరుస విజయాలు చూసి హ్యాట్రిక్ సాధించడం అన్నది కొత్తేమీ కాదు. అయితే ఓ హీరోతో ఓ దర్శకుడు రన్నింగ్ లో కానీ, వసూళ్ళలో కానీ వరుసగా మూడు చిత్రాలతో రికార్డులు సృష్టించడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి అరుదైన రికార్డులను నటసింహ నందమూరి బాలకృష్ణతో ఇప్పటి వరకు కోడి రామకృష్ణ, బి.గోపాల్ సాధించారు. వారిద్దరి సరసన ఇప్పుడు బోయపాటి శ్రీను కూడా చేరిపోయారు. ఈ ముగ్గురు…
టాలీవుడ్లో హీరో నందమూరి బాలకృష్ణ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఈ విజయాల్లో ముఖ్యంగా ఇద్దరు డైరెక్టర్లకు సింహ భాగం ఉంది. గతంలో బాలయ్య-బి.గోపాల్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ షేక్ అయ్యేది. వీరిద్దరి కాంబోలో చాలా హిట్లు ఉన్నాయి. లారీడ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే భారీ అంచనాలతో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలం కావడంతో ఆ…
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన మూడవ చిత్రం “అఖండ”. నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఖండ ఖండాలలో ‘అఖండ’మైన విజయం లభించింది. 2021లో ఓవర్సీస్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు క్రియేట్ చేసింది. ఇక డిసెంబర్ 2న థియేటర్లలో మొత్తం ‘జై బాలయ్య’ నామజపమే విన్పించింది. సోషల్ మీడియాలో, థియేటర్ల వద్ద భారీ కటౌట్లు పెట్టి ఆయన అభిమానులు చేసిన సందడి మాములుగా లేదు.…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం అఖండ. ఈరోజు విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. ‘అఖండ’ విజయాన్ని సొంతం చేసుకొని రికార్డుల కలక్షన్స్ ని కొల్లగొడుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అందుకొని చిత్ర పరిశ్రమకు ఊపుని ఇచ్చింది. ఇక ఈ చిత్ర విజయంపై టాలీవుడ్ స్టార్లు తమదైన రీతిలో స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా అఖండ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అంటే అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకుతాయి. ‘అఖండ’ విషయంలోనూ అదే జరిగింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘సింహా’, ఆల్ టైమ్ రికార్డ్స్ ను సృష్టించిన ‘లెజెండ్’ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా నిర్మించే ఛాన్స్ ఈ సారి మిర్యాల రవీందర్ రెడ్డి దక్కించుకున్నాడు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారీస్థాయిలో ‘అఖండ’ను నిర్మించి విడుదల చేశారు. బాలయ్య అభిమానుల హంగామాతో ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాకు…
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం “అఖండ”. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ తోనే దూసుకెళ్తోంది. బాలయ్య, బోయపాటి కాంబోలో మూడవ చిత్రంగా వచ్చిన ‘అఖండ’ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. సినిమాపై సెలెబ్రిటీలతో పాటు అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు ‘అఖండ’కు ఫిదా అయ్యి సోషల్ మీడియాలో బాలయ్య పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. మరికొందరు సినిమా విజయానికి బాలయ్యతో…
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన “అఖండ” చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్, జగపతి బాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే సెంటిమెంట్ ను బాగా నమ్మే బాలయ్య ఈసారి మాత్రం ‘అఖండ’కు సంబంధించి ఓ సెంటిమెంటును బ్రేక్ చేశారు. Read Also : బాక్స్ ఆఫీస్ పై ‘అఖండ’ దండయాత్ర… ఒక్కరోజులోనే చరణ్ రికార్డు బ్రేక్ తన…