“అఖండ” సినిమాతో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ‘అఖండ’ జాతర బాలయ్య ఫ్యాన్స్ నే కాకుండా అందరినీ ఆ దైవభక్తికి సంబంధించిన ట్రాన్స్ లోకి నెట్టేసింది. అయితే ఇప్పుడు బాలయ్యకు ఓ హీరోయిన్ ఏకంగా సాష్టాంగ నమస్కారం చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Also : కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కథ చెబుతాడు… బోయపాటిపై బాలయ్య కామెంట్స్
ఇక విషయంలోకి వెళ్తే… ‘అఖండ’ సినిమా సక్సెస్ మీట్ నిన్న రాత్రి వైజాగ్ లో జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో కీలక పాత్రను పోషించిన హీరోయిన్ పూర్ణ స్టేజ్ పై మాట్లాడుతూ చాలా ఎగ్జైట్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో తన 16 ఏళ్ల కెరీర్ లో ఇంతటి సక్సెస్ ఫుల్ మూవీ వేదికపై మాట్లాడడం ఇదే మొదటిసారని, మాట్లాడడానికి మాటలు రావట్లేదని అన్నారు. ఇక శ్రీకాంత్ సినిమాలో విలన్ గా భయపెట్టినా తన అందం చూసి అవన్నీ మరిచిపోయానని చెప్పుకొచ్చారు. చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలియజేసిన పూర్ణ బాలయ్య గురించి చెప్పడానికి మాటలు రావట్లేదని అంటూ సాష్టాంగ నమస్కారం ద్వారా తన అభిమానాన్ని వ్యక్తపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.