నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల ‘అఖండ’ విజయోత్సవ జాతర నిన్న రాత్రి వైజాగ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ బాలకృష్ణతో రెండవసారి పని చేయడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇలాంటి పాత్రను ఇచ్చినందుకు బోయపాటికు కృతజ్ఞతలు తెలిపారు. ‘అఖండ’ జాతర మరికొన్ని రోజులు కొనసాగాలని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఆకాంక్షించారు. బాలకృష్ణ, బోయపాటిపై ప్రశంసలు కురిపించారు. దర్శకుడికి ‘మాస్ కా బాప్’ అనే ట్యాగ్ కూడా ఇచ్చాడు.
Read Also : ఒకే ఒక్కడు ప్రభాస్… గ్లోబల్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్
బోయపాటి శ్రీను మాట్లాడుతూ “ఈ వేడుకను జరుపుకోవడానికి ప్రధాన కారణం సినీ ప్రియులు మంచి సినిమాను ఎప్పటికీ ప్రోత్సహిస్తారని మరో సారి నిరూపించారు. ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీకి కాన్ఫిడెన్స్‌ని ఇచ్చింది. సాధారణంగా నటీనటులు పాత్రలు చేయడానికి ఉత్సాహంగా ఉంటారు. కానీ, బాలకృష్ణ క్యారెక్టర్ చేస్తే క్యారెక్టర్లు రెచ్చిపోతుంటాయి. బాలకృష్ణ గారితో మూడు సినిమాలకు పని చేయడం ఆనందంగా ఉంది. ప్రకృతి, పిల్లలు, పరమాత్మని మనం గౌరవిస్తే రాబోయే తరాలు అభివృద్ధి చెందుతాయి” అని అన్నారు.
బాలకృష్ణ మాట్లాడుతూ “ఈరోజు వర్షం పడుతుందని వాతావరణ నివేదికలు వచ్చాయి. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా వర్షం పడకపోవడం అంటే ప్రకృతి సహకరించడం శుభపరిణామం. సింహా, తర్వాత లెజెండ్, ఇప్పుడు అఖండతో మేము హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేసాము. బోయపాటి, నేనూ ఒకరినొకరు బాగా నమ్ముతాము. అతను సాధారణంగా నాకు పూర్తి కథలు చెప్పడు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా కథను చెబుతాడు. సినిమాల్లోని కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే వింటాను. తన నటీనటులు, సాంకేతిక నిపుణుల నుండి ట్యాలెంట్ ను అత్యుత్తమంగా బయటకు తీసుకురాగల సామర్థ్యం బోయపాటికి ఉంది” అంటూ బోయపాటిపై ప్రశంసల వర్షం కురిపించారు.