“అఖండ”లో బాలయ్య విగ్గు కోసం షాకింగ్ బడ్జెట్ !?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“అఖండ” సూపర్ సక్సెస్‌తో సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అగ్రనటుడు మురళీకృష్ణ పాత్రలో అందంగా, మనోహరంగా కనిపించగా, ‘అఖండ’ పాత్రలో అఘోరా లుక్ లో కనిపించాడు. బాలకృష్ణను ఎలా ప్రెజెంట్ చేయాలో బోయపాటి శ్రీనుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనే చెప్పాలి. బోయపాటి దర్శకత్వం వహించిన మూడు సినిమాల్లోనూ బాలయ్య అందంగా కనిపించాడు. తాజా సమాచారం ప్రకారం బాలయ్య అందం వెనుక ఆయన విగ్ కూడా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య విగ్గు కోసమే ఏకంగా లక్షల్లో ఖర్చు పెట్టారట మేకర్స్.
Read Also : రూమర్స్ నమ్మొద్దు… నాగచైతన్య నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Also Read
ఈ సినిమాలో బాలయ్య విగ్గుల కోసం మేకర్స్ దాదాపు రూ. 50 లక్షలు ఖర్చు చేశారని సమాచారం. 39 లక్షలు వెచ్చించి మూడు విగ్గులను మేకర్స్ కొనుగోలు చేశారట. సినిమాలో మురళీకృష్ణ పాత్రకు ఈ మూడు విగ్గులే ఉపయోగించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ లుక్ కోసం మేకర్స్ ముంబైకి చెందిన హెయిర్ స్పెషలిస్ట్‌ను నియమించారట. మరి ముంబై నుంచి టెక్నిషియన్లు అంటే వారి పారితోషికం వేరే లెవెల్ లో ఉంటుందన్న విషయాలు తెలిసిందే కదా. హెయిర్ స్టైలిస్ట్‌కు రూ. 12 లక్షలు చెల్లించారట మేకర్స్. మొత్తం మీద మేకర్స్ విగ్గుల కోసం 50 లక్షలు ఖర్చు చేశారని ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా విడుదలై వారం గడుస్తున్నా కూడా ఇప్పటికే “అఖండ” డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!