సాధారణంగా పొట్టి క్రికెట్‌లో బౌలర్ల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లు బౌలర్లను చితకబాది పరుగుల మీద పరుగులు చేస్తుంటారు. దీంతో బౌలర్ల గణాంకాలు దారుణంగా నమోదవుతుంటాయి. ఒక రకంగా బౌలర్‌కు టీ20 ఫార్మాట్‌లో బౌలింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటారు. బౌలర్లు ఓవర్‌కు 10కి పైగా పరుగులు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు అనే చెప్పాలి. అయితే ఐపీఎల్‌లో బెస్ట్ ఎకానమీతో…