Anil Kumble React on Boundary Length in T20 Cricket: టీ20 ఫార్మాట్ వచ్చాక.. బౌలర్ల ఆధిపత్యం తగ్గిపోయింది. ఎదో ఒక మ్యాచ్‌లో తప్పితే.. బ్యాటర్ల హవానే కొనసాగుతోంది. ఇందుకు మంచి ఉదాహరణే ఐపీఎల్ 2024. ఐపీఎల్ 17వ సీజన్‌లో 200 పైగా స్కోర్లు అలవోకగా నమోదవుతున్నాయి. ఐపీఎల్ 2024లో 287 రన్స్ నమోదవడం విశేషం. భారీ స్కోరుకు బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌లు ఓ కారణం అయితే… బౌండరీ లెంత్ తగ్గించడమూ మరో కారణం. బ్యాటర్ల…
ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఈరోజు బెంగళూరులో న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు చెత్త రికార్డును నెలకొల్పారు. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అత్యంత చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్తాన్ బౌలర్‌గా అఫ్రిది నిలిచాడు.
ప్రపంచకప్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు ఎవరో తెలుసుకుందాం. ఈ జాబితాలో జహీర్ ఖాన్ అగ్ర స్థానంలో ఉన్నాడు. అతను 23 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో 44 వికెట్లు తీశాడు. ఈ జాబితాలో జావగల్ శ్రీనాథ్ రెండో స్థానంలో ఉన్నాడు. జవగల్ శ్రీనాథ్ 34 మ్యాచ్‌ల్లో 44 మంది ఆటగాళ్లను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఉన్నాడు.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సహా ఐదుగురు ఆటగాళ్లు పునరావాసంలో ఉన్నారు. అయితే వారు తిరిగి మ్యాచ్‌లు ఆడేందుకు.. ఎంత ఫిట్‌గా ఉన్నారు. ఎప్పుడు స్టేడియంలోకి అడుగుపెడుతారనే విషయాన్ని బీసీసీఐ శుక్రవారం తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్ జట్టు స్పిన్ బౌలింగ్‌కు చాలా ఫేమస్ అని క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిన విషయమే. ఈ జట్టులో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లు.. ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెట్టగలరు. అయితే శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్లు తమ సత్తా చాటుతూ భారీ స్కోరు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో తొలిరోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. తొలి సెషన్ నుంచి నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా ఫస్ట్ రోజే 300 పరుగులు మార్క్ దాటి భారీ స్కోరుపై కన్నేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ముంబై ఇండియన్స్ బ్యాటర్లు.. 10 ఓవర్లకు స్కోర్.. ముంబై రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్..
మహేంద్ర సింగ్ ధోనిపై ఉన్న అభిమానం మరొక ఎత్తు అని చెప్పొచ్చు. ఈ సీజన్‌లో మహేంద్రుడి క్రేజ్ ఎలా ఉందంటే అతను ఒక్క బంతి ఆడినా చాలు మాకు అదే మహాభాగ్యం అన్నట్లుగా ధోని అభిమానులు పరవశించిపోతున్నారు. అయితే ఎంఎస్ ధోని క్రేజ్‌కు ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలో సరైన బంతులు వేయడంలో వరుసగా విఫలమవుతున్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడుతున్నాయి. అయితే అదిలోనే కేకేఆర్ జట్టుకు ఢిల్లీ షాక్ ఇచ్చింది. పపర్ ప్లేలో కీలకమైన మూడు వికెట్లను తీసుకుంది.
బ్యాట్స్‌మన్‌కు ఫ్రీ హిట్ ఇచ్చినట్లే.. బౌలర్‌కు ఫ్రీ బాల్ ఇవ్వాలని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ డిమాండ్ చేశాడు. వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. కొన్ని నిబంధనలతో బౌలర్లకు అన్యాయం జరుగుతుందన్నాడు. అందులో ఫ్రీ హిట్ ఒక్కటని, దాన్ని రద్దు చేయాలనీ అభిప్రాయపడ్డాడు. అలాగే దీని పై తమ తమ అభిప్రాయం చెప్పాలని ట్విట్టర్ వేదికగా క్రికెటర్లను, విశ్లేషకులను కోరాడు. దీనిపై స్పందించిన అశ్విన్.. ఫ్రీబాల్ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చాడు. అందులో ‘సంజయ్, ఫ్రీహిట్ అనేది…