విజయవాడలో ప్రారంభమైన 32వ పుస్తక మహోత్సవాన్ని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వర్చువల్‌గా ప్రారంభించారు. స్వరాజ్య మైదానం నుంచి మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..పుస్తక అనువాదంతోనే భారతీయ భాషల సాహిత్యం విస్తృతం అవుతుందన్నారు. చిన్నారులకు పుస్తక పఠనం అలవాటు చేసేలా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. ఇతర భాషల నుంచి రచనలను తెలుగులోకి అనువదించి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి,…