Vangalapudi Anitha: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో రిపోర్టుపై టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అనుకున్నట్లే జరిగిందని.. తప్పును కప్పిపుచ్చడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. డర్టీ ఎంపీ మాధవ్‌కు సచ్చీలుడు అన్న సర్టిఫికెట్ ఇస్తున్నారని మండిపడ్డారు. దీన్ని సమర్థిస్తున్నారా లేదా అనేది సీఎంగా, ఆ పార్టీ అధ్యక్షుడిగా జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర మహిళల…
టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చిన వ్యవహారం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు. జగన్.. ఇవాళ నీది.. రేపు మాది గురుపెట్టుకో అంటూ మండిపడ్డారు. జగన్.. మా ఇంటి గోడలు పడగొడుతున్నావ్.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ టీడీపీ నేతల ఇళ్లని కూలుస్తున్నారని…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. భారత దేశంలో అత్యంత అవినీతి సీఎం జగన్ అని.. ఏపీలో కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే పథకం ప్రకారం జగన్ అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. కల్పవృక్షం లాంటి అమరావతిని నీరుగార్చారని.. ఒక సామాజిక వర్గానికి అమరావతిని అంటగట్టడం దారుణమైన విషయమని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం అమరావతే రాజధాని…
మేడే సందర్భంగా విజయవాడలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోండా ఉమ, గద్దె రామ్మోహనం, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ.. మూడేళ్ల జగన్ పాలనలో ఒక కార్మికుడు చనిపోయినా రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. కార్మికులు దాచుకున్న డబ్బులను కూడా జగన్ సర్కార్ తినేసిందని విమర్శించారు. ఏపీలో మళ్లీ…
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచార ఘటన తర్వాత.. ఏపీ మహిళా కమిషన్ ఎపిసోడ్ వార్తల్లో నిలిచింది.. దీనికి కారణం.. పరామర్శల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన వాగ్వాదం.. ఆ తర్వాత, ఆరోపణలు, విమర్శలు, నోటీసులు, ఆందోళనల వరకు వెళ్లింది.. తాజాగా, ఈ వ్యవహారంలో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. బాధితుల గోప్యత పాటించే విషయంలో వాసిరెడ్డి పద్మే…
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సహాయం అందించింది. ఈ మేరకు టీడీపీ నేతలు బోండా ఉమ, వంగలపూడి అనిత బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా వ్యాఖ్యలకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని.. జగన్ ప్రభుత్వ హయాంలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. బ్లూఫిల్మ్‌లలో పాల్గొన్నట్టు స్వయంగా రోజా మీదే అభియోగాలు…
ఏపీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఈనెల 27న బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేత బోండా ఉమ చెప్పారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద ఇటీవల మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నానాయాగీ చేశారని.. చంద్రబాబు వస్తున్నారని తెలిసి మేకప్ వేసుకుని వచ్చారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. మహిళా కమిషన్‌కు లేని పవర్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పెన్ను, పేపర్ ఉందని నోటీసులు ఇచ్చి.. ఎలా రారో చూస్తామంటూ ఛాలెంజ్‌లు చేస్తున్నారని…
టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. తనకు పబ్లిసిటీ పిచ్చి అని బోండా ఉమ ఆరోపణలు చేస్తున్నాడని.. మూడేళ్లుగా మహిళా కమిషన్ తరఫున పనిచేస్తున్నా ఏ రోజు కూడా పబ్లిసిటీ గురించి పట్టించుకోలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. బోండా ఉమ ఆకు రౌడీ అనుకున్నానని.. కాదు ఆయన చిల్లర రౌడీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుడి రూపంలో ఉన్న కాలకేయుడు అని..…