Gujarat: అహ్మదాబాద్‌లోని ఓ ఇంట్లో డెలివరీ చేసిన పార్సిల్ పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. తన నుంచి భార్యని విడదీసేందుకు కారణమైన ఆమె ఫ్రెండ్ బల్దేవ్ సుఖాడియా, ఆమె తండ్రి, సోదరుడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు నిందితుడు రూపన్ రావు(44) ఇంటర్నెట్‌లో బాంబులు, నాటు తుపాకులను తయారుచేయడం నేర్చుకున్నట్లు తేలింది.