Bomb Threats: విమానాలపై బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. బాంబు బెదిరింపు కారణంగా ప్రతిరోజు విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడుతోంది. ఇందులో భాగంగా ప్రయాణీకులు కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. శనివారం 10 వేర్వేరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఐదు విమానాలు ఇండిగోకు చెందినవి కాగా.. ఐదు విమానాలు ఆకాసా ఎయిర్‌లైన్స్‌కు చెందినవి. సమాచారం ప్రకారం, 6E108 హైదరాబాద్-చండీగఢ్, 6E58 జెడ్డా-ముంబై, 6E17 ముంబై-ఇస్తాంబుల్, 6E184 జోధ్‌పూర్-ఢిల్లీ, 6E11 ఢిల్లీ-ఇస్తాంబుల్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇకపోతే గత 6 రోజుల్లో, దాదాపు 70 విమానాలకు ఇటువంటి బెదిరింపులు వచ్చాయి. దీని కారణంగా విమానయాన సంస్థలు భారీ నష్టాన్ని చవిచూశాయి. చాలా విమానాలు దారి మళ్లించబడ్డాయి. మరికొన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
Revanth Reddy Vs Harish Rao: నిన్న హరీష్ రావు కామెంట్స్.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
ఇక తాజా సమాచారం మేరకు దర్భంగా నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బాంబు బెదిరింపు కేసుల్లో ఇప్పటి వరకు ముంబై పోలీసులు వివిధ కేసుల్లో మొత్తం 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇలాంటి కేసులు నిరంతరంగా పెరుగుతున్న దృష్ట్యా వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విమానంలో ఈ బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే, అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకుంటారు.
RBI Internship 2025: కళాశాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అందిస్తున్న ఆర్బీఐ.. రూ.20,000 స్టైపెండ్ కూడా
నిపుణుల అభిప్రాయం ప్రకారం, దేశీయ విమానాల రూట్ మార్చడం వల్ల కంపెనీలు ప్రతి గంటకు రూ.13 నుండి 17 లక్షల వరకు నష్టపోతున్నాయి. అంతర్జాతీయ విమానాల్లో ఇది 5 రెట్లు ఎక్కువగా ఉంది. బెదిరింపులకు గురైన 70 విమానాలను దేశీయ విమానాలుగా అనుకుంటే.. కంపెనీలకు దాదాపు రూ.12 కోట్ల నష్టం వాటిల్లింది. విమానాల తనిఖీ, ప్రయాణికులు, సిబ్బందికి వసతి, కనెక్టింగ్ ఫ్లైట్‌లు, ఇంధనం వంటి ఖర్చులను దీనికి జోడిస్తే ఈ సంఖ్య రూ.50 నుండి 80 కోట్లకు చేరుతుంది.