Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలకు ఈరోజు (నవంబర్ 28) బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం 10:57 సమయంలో ఈ- మెయిల్ ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం.. పోలీసులకు సమాచారం అందజేసింది.