Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టుకు అమెరికా నుంచి బాంబు బెదిరింపు మెయిల్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అమెరికా న్యూయార్క్ నుంచి జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ పంపాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అమెరికా వెళ్ళే విమానాల్లో బాంబు ఉందని మెయిల్ పంపాడు.. విమానాలు టేకాఫ్ అయిన పది నిమిషాల్లో బాంబు పేలుస్తా అంటూ బెదిరింపు మెయిల్‌లో పేర్కొన్నాడు. బాంబు పేలకూడదు అంటే ఒక మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
READ MORE: Vijay: కరూర్ తొక్కిసలాట తర్వాత నేడు పబ్లిక్‌లోకి వస్తున్న విజయ్.. వేదిక ఎక్కడంటే..!
కాగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దీంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. మొన్న(ఆదివారం) కన్నూర్–హైదరాబాద్, ఫ్రాంక్‌ఫర్ట్–హైదరాబాద్, లండన్–హైదరాబాద్ మార్గాల్లో ప్రయాణిస్తున్న విమానాలకు బాంబు పెట్టినట్లు ఈ మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.. ఆ మూడు విమానాలు ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే అధికారులు అత్యవసర తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు సంబంధిత విమానాల్లో దశలవారీగా తనిఖీలు ప్రారంభించాయి. ప్రయాణికుల లగేజీలు, క్యాబిన్ బ్యాగులు, కార్గో విభాగాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. అలాగే, ఈ మెయిల్స్ ఎవరు పంపారన్న దానిపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.
READ MORE: Today Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త!