Jammu Kashmir : సాధారణంగా జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు, ఎన్‌కౌంటర్‌ల ఘటనలు తరచూ వార్తల్లో చూస్తుంటాం. ఐతే ఈసారి నర్వాల్ ప్రాంతంలో వరుస పేలుళ్లు సంభవించాయి. నర్వాల్‌లో ట్రక్కుల హబ్‌గా పేరొందిన ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో ఉన్న ఓ యార్డ్‌లో భారీ శబ్ధంలో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని జమ్ముజోన్ ఏడీజీపీ ముకేశ్ సింగ్ చెప్పారు. సురాన్‌కోట్ మాజీ ఎమ్మెల్యే, గుజ్జర్ నాయకుడు చౌదురి మహమ్మద్ అక్రమ్ ఇంట్లో శుక్రవారం రాత్రి 7.30 గంటలకు భారీ పేలుడు చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి తన కుటుంబ సభ్యులు తృటిలో తప్పించుకున్నారని చెప్పారు. కాగా, ఘటనా స్థలంలో 12 కాట్రిజ్‌లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్పారు.
Read Also: Viral : తాగిన ఒక్క బీరుకు.. బారెడంత బిల్లు వేసి మత్తు దించిన పోలీసులు
శనివారం ఉదయం జమ్మూ నగరంలోని నర్వాల్ ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. పేలుడు కోసం కార్లకు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లను (ఐఈడీ) అమర్చినట్లు వెల్లడించారు. పేలుళ్ల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. కాగా, జమ్ముకాశ్మీర్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూలో పేలుళ్లు సంభవించడం తీవ్ర కలకలం సృష్టించింది.
#WATCH | J&K: Six people injured in two blasts that occurred in Narwal area of Jammu. Visuals from the spot. Police personnel are present at the spot. pic.twitter.com/eTZ1exaICG
— ANI (@ANI) January 21, 2023