బాలీవుడ్ బాట పట్టనున్న వరుణ్ తేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ఫ్యామిలీ యంగ్ హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ పై కన్నేశాడా!? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ చిత్రంతో పాటు, వెంకటేశ్ తో కలిసి ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ రెండు సినిమాలు కాస్తంత ముందు వెనుకగా ఈ యేడాదే విడుదల అవుతాయని తెలుస్తోంది. దీని తర్వాత వరుణ్ తేజ్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో క్లారిటీ లేదు. అయితే అతి త్వరలోనే వరుణ్ తేజ్ హిందీలో ఓ సినిమాలో నటిస్తాడని అంటున్నారు. నూతన దర్శకుడు చెప్పిన కథకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ప్రస్తుతం అడివి శేష్ తో ‘మేజర్’ మూవీని నిర్మిస్తున్న సోని పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతోందని తెలుస్తోంది. కేవలం హిందీలోనే ఈ సినిమా రూపుదిద్దుకుంటుందని కొందరంటుంటే, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించి, ఆ తర్వాత ఇతర దక్షిణాది భాషల్లో డబ్ చేసి, పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా మెగా ఫ్యామిలీ యంగ్ హీరో బాలీవుడ్ బాట పట్టడం మాత్రం ఖాయమనే గుసగుసలు ఫిల్మ్ నగర్ లో బాగానే వినిపిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Jensen Huang: ఎన్విడియా సీఈఓగా తిరిగి జెన్సన్ హువాంగ్ నియామకం..
-
UP Crime: అక్క భర్తతో ప్రేమాయణం.. పెళ్లికి అడ్డుగా ఉందని తల్లిని చంపేసింది!
-
NIMS : నిమ్స్‌లో ఏసీబీ షాకింగ్ తనిఖీలు.. చనిపోయిన రోగుల పేరుతోనూ బిల్లులు!
-
Sourav Ganguly: మీకేమైనా మైండ్ పని చేస్తుందా..? టెస్టు డ్రాపై గంగూలీ కీలక వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy : కృష్ణా జలాలపై హరీష్ రావుకు రేవంత్ సవాల్.. లెక్కలతో తేల్చుకుందామా?
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!