ప్లే బోయ్లా సాగుతున్న రణబీర్ కపూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 28న రణబీర్ కపూర్ బర్త్ డే)
బాలీవుడ్ నవతరం కథానాయకుల్లో రణబీర్ కపూర్ తీరే వేరు. ప్లే బోయ్ ఇమేజ్ తో పలువురు అమ్మాయిలతో రణబీర్ సాగించిన ప్రేమాయణాలను గురించి ముంబైలో పలు కథలు వినిపిస్తూ ఉంటాయి. అలాగని కేవలం భోగలాలసుడేమీ కాదు, నటనలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు రణబీర్. కపూర్ వంశంలో నాలుగో తరం హీరోగా విజయకేతనం ఎగురవేస్తున్నాడు రణబీర్ కపూర్. తండ్రి రిషి కపూర్, తాత రాజ్ కపూర్, ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ వారసత్వాన్ని నిలుపుతూ వైవిధ్యం ప్రదర్శిస్తున్నాడు రణబీర్. తల్లి నీతూ సింగ్ కూడా ఓ నాటి మేటి నటి. అలా రణబీర్ లో ఎలా చూసినా నటన నర్తనం చేస్తూనే ఉంది.
రణబీర్ తండ్రి రిషికపూర్ బాలనటునిగానే భళా అనిపించారు. అదే తీరున రణబీర్ లోనూ చిన్నప్పటి నుంచీ నటనపై అభిలాష మెండుగానే ఉంది. అభినయంపై ఆసక్తితోనే అమెరికా వెళ్ళి అక్కడ న్యూయార్క్ లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్, లీ స్ట్రాస్ బెర్గ్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్లోనూ నటన,దర్శకత్వం విభాగాల్లో శిక్షణ పొందాడు రణబీర్. స్వదేశం వచ్చిన తరువాత సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన బ్లాక్ చిత్రానికి అసోసియేట్ గా పనిచేశాడు. ఆ తరువాత అదే భన్సాలీ తెరకెక్కించిన సావరియా చిత్రంతో హీరో అయ్యాడు రణబీర్. తరువాత తన సరసన హీరోయిన్లుగా నటించిన దీపికా పదుకొణే, కత్రినా కైఫ్ వంటివారితో ప్రేమాయణం సాగించాడు తనకంటే వయసులో పెద్ద అయిన నాయికలతోనూ రొమాన్స్ చేశాడు. అలా ప్లేబోయ్ ఇమేజ్ తో సాగిన రణబీర్ కపూర్ కు నిలకడ లేదు అనే పేరు దక్కింది. అతనితో ప్రేమవ్యవహారం సాగించిన వారు వేరే దారి చూసుకున్నారు. ఇప్పుడు రణబీర్ కపూర్, అలియా భట్ తో ప్రేమయాత్రలు చేస్తున్నాడు.
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
రణబీర్ కపూర్ కెరీర్ లో అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ, రాజ్ నీతి, రాక్ స్టార్, బర్ఫీ, యే జవానీ హై దివానీ, యే దిల్ హై ముస్కిల్, సంజు వంటి జనరంజకమైన చిత్రాలు ఉన్నాయి. బర్ఫీ, సంజు చిత్రాలలో రణబీర్ నటన చూసి ఫిదా అయిపోయిన వారెందరో ఉన్నారు. రణబీర్ కపూర్ తన ప్రతి చిత్రంలో వైవిధ్యం కోసం తపిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే పాత్రల ఎంపిక చేసుకుంటున్నాడు. షంషేరా చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. మన టాలీవుడ్ స్టార్ నాగార్జునతో కలసి బ్రహ్మాస్త్రలోనూ నటించాడు. లవ్ రంజన్ తెరకెక్కిస్తోన్న మరో చిత్రంలోనూ రణబీర్ నటిస్తున్నాడు. ఈ చిత్రాలలోనూ వైవిధ్యమైన పాత్రల్లో రణబీర్ అలరిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అలియా భట్ తో సహజీవనం సాగిస్తోన్న రణబీర్ ఆమె మెడలో ఎప్పుడు మూడు ముళ్ళు వేస్తాడో చూడాలని సినీజనం ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో!?
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
Mobile Sales: అమ్మో.. స్మార్ట్ ఫోన్..! అంత పెట్టి కొనలేం బాబోయ్
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!