కెరీర్ మొదటి కమెడియన్‌గా సినిమాలు చేసిన సునీల్.. ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా కొన్నేళ్లు బిజీగా సినిమాలు చేశాడు. కాని హీరోగా కొన్ని సినిమాలు కలిసి రాక పోవడంతో.. మళ్లీ కమెడియన్‌గా చేస్తున్నాడు. ఇక పుష్ప సినిమాతో పూర్తిగా విలన్‌గా మారిపోయాడు సునీల్. అంతకు ముందు రవితేజ డిస్కోరాజాలో నెగెటివ్ రోల్ చేసినప్పటికీ.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో విలన్‌గా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ…
ఎన్నికల సమయంలో సినిమా వాళ్ళ పబ్లిసిటీని రాజకీయ నేతలు కోరుకుంటున్నట్టే… ఇప్పుడు సినిమా వాళ్ళు రాజకీయ నేతలు తమ చిత్రం గురించి నాలుగు మంచి మాటలు చెబితే బాగుండని ఆశపడుతున్నారు. ఆ మధ్య వచ్చిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ మూవీకి బీజేపీ నేతలు బాగానే పబ్లిసిటీ చేశారు. అలానే ఇటీవల కాన్స్ లో ప్రదర్శితమైన మాధవన్ ‘రాకెట్రీ’ మూవీ టీజర్, ట్రైలర్ తో పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ…
బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ బర్త్‌డే వేడుకలు గత రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. బుధవారం రాత్రి ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్ లో జరిగిన కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ వేడుకలో బాలీవుడ్ సామ్రాజ్యంను ఏలుతున్న స్టార్లందరూ హాజరయ్యి హంగామా చేశారు. ఇక ఈ సామ్రాజ్యంలో టాలీవుడ్ లో ఏకైక మొనగాడు విజయ్ దేవరకొండ కింగ్ లా కనిపించాడు. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి విజయ్…
ఒకప్పుడు ఉత్తరాన ఉరిమితే, దక్షిణాన తడుస్తుంది అనే సామెత హిందీ చిత్రసీమలో భలేగా హల్ చల్ చేసింది. ఎందుకంటే అప్పట్లో హిందీలో విజయవంతమైన చిత్రాలను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసి విజయాలు సాధించేవారు. పైగా హిందీ సినిమాయే భారతీయ సినిమా అనే కలర్ తీసుకు వచ్చి, దానినే అంతర్జాతీయంగా పరిచయం చేస్తూ పోయారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్రాంతీయ చిత్రాలు సైతం అంతర్జాతీయ మార్కెట్ లో తమ సత్తా చాటుకుంటున్న రోజులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ,…
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో కామ్ అండ్ కూల్ గా ఉండే హీరో ఎవరు అంటే టక్కున మహేష్ బాబు అని చెప్పేస్తారు. వివాదాలు జోలికి పోకుండా తన పని ఏదో తానూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఇటీవల మేజర్ ట్రైలర్ లాంచ్ లో బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన విషయం విదితమే.. బాలీవుడ్ కి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోనని, తనకు…
బాలీవుడ్ మీద మోజుతో, అక్కడికెళ్ళిన దక్షిణాది భామలకు దాదాపు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం, ఆఫర్లు కూడా అంతంత మాత్రమే రావడం, అందునా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కావడం లాంటివి జరిగాయి. ఒకరిద్దరు మినహాయిస్తే, మిగతా హీరోయిన్ల పరిస్థితి అక్కడ ఆల్మోస్ట్ గల్లంతే! ఇదీ.. మన దక్షిణాది భామలపై బాలీవుడ్‌కి ఉన్న చిన్నచూపు! పచ్చిగా చెప్పాలంటే.. కూరలో కరివేపాకులా చూస్తారు. ఇప్పుడు సమంత విషయంలోనూ బాలీవుడ్ మేకర్స్ అలాంటి వ్యవహార శైలే…
గతేడాది టాలీవుడ్ ను షేక్ చేసిన వార్త ఏది అంటే అక్కినేని నాగ చైతన్య – సమంత విడాకుల న్యూస్ మాత్రమే.. ఎన్నో ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట పట్టుమని నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక విడిపోయారు. అయితే విడిపోక ముందు సుమారు 4, 5 నెలల వరకు వీరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయే తప్ప ఇద్దరిలో ఎవరు అధికారికంగా విడిపోతున్నట్లు చెప్పలేదు. వీరి గురించి ఎన్నో పుకార్లు, చర్చలు జరిగి…
సినీ పరిశ్రమలో ఎంతో ప్రత్యేకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరకొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 17 నుంచి 28 వరకు 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ఘనంగా జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా…
తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్’ మూవీ 2020లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్లో రీమేక్ అవుతోంది. విశ్వక్ సేన్ పాత్రలో రాజ్‌కుమార్ రావు, రుహాని శర్మ పాత్రలో సన్యా మల్హోత్రా కనిపించనున్నారు. తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్ కొలను హిందీ రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు, భూషణ్‌కుమార్, కృష్ణన్ కుమార్, కుల్దీప్ రాథోడ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ‘హిట్’ మూవీ రిలీజ్ డేట్‌ను…
బాలీవుడ్ తనని భరించలేదని, అక్కడికెళ్ళి తన సమయాన్ని వృధా చేసుకోలేనని మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఎంత దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. బాలీవుడ్ నుంచి తారాస్థాయి వ్యతిరేకత ఎదురవుతోంది. మహేశ్‌ని చాలా బ్యాడ్‌గా ట్రోల్ చేస్తున్నారు. తాను బాలీవుడ్‌ని కించపరచలేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ.. మహేశ్‌పై విమర్శలు ఆగడం లేదు. అయితే.. నిర్మాత బోనీ కపూర్ మాత్రం తాను మహేశ్ వ్యాఖ్యలపై స్పందించనని చేతులెత్తేశాడు. ఆ కామెంట్స్‌పై రియాక్ట్ అవ్వడానికి తాను…