కరోనా ఇప్పుడిప్పుడే తగ్గు ముఖం పడుతుందని ఆనందించేలోపు కరోనా కేసులు పెరగడం భయాందోళనకు గురిచేస్తోంది.ఇక ఇప్పుడిప్పుడే చిత్రపరిశ్రమ కొద్దికొద్దిగా కోలుకొంటుంది. పార్టీలు, ఈవెంట్స్ అంటూ కళకళలాడుతున్నాయి.అయితే ఒకేసారి 50 మంది స్టార్లు కరోనా బారిన పడడం షాక్ కు గురిచేస్తోంది. అయితే ఇందుకు కారణం ఒక బర్త్ డే అని తెలుస్తోంది. అది ఎవరిదో కాదు. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పార్టీ అని సమాచారం. కోవిడ్ వైరస్ ఈ పార్టీలో 50 మంది అతిథులపై…
ప్రపంచ మాజీ సుందరి, ప్రముఖ నటి మానుషి చిల్లర్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌పై హాట్ కామెంట్స్ చేసింది. తనకు రామ్‌చరణ్ అంటే క్రష్ అని.. అతగితే డేట్‌కు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా చూశాక రామ్‌చరణ్‌కు తాను పెద్ద ఫ్యాన్ అయిపోయానని మానుషి చిల్లర్ చెప్పింది. ప్రస్తుతం మానుషి చిల్లర్ ఓ బాలీవుడ్ సినిమాలో నటించింది. అక్షయ్ కుమార్ నటించిన ‘పృథ్విరాజ్’ చిత్రంలో మానుషి కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా…
అందరిలో ఆసక్తి కలిగించే విషయాలు నాలుగు ప్రధానాంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. అవి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అంశాలని క్రీస్తు పూర్వం నుంచీ ఎందరో తాత్వికులు ప్రతిపాదించారు. నవీనయుగం ఆ నాలుగు అంశాలనూ “Political, Economical, Social and Technological” అంటూ పేర్చి, ముద్దుగా ‘PEST’ అని పెట్టుకుంది. ఈ నాలుగు అంశాల నుంచి తప్పించుకొనే ప్రధాన అంశాలేవీ ఉండవు. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ఆర్యన్ ‘డ్రగ్స్’ కేసు నుండి ‘క్లీన్ చిట్’తో…
డ్రగ్స్ కేసుల్లో ఏం జరుగుతోంది?ఒక్క సెలబ్రిటీకి కూడా శిక్షపడదా?ఆధారాల్లేకుండానే అరెస్టులు, విచారణలు జరుగుతున్నాయా?సెలబ్రిటీలను కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారా? ఓ రేంజ్ లో హడావుడి చేస్తారు..దేశమంతా దాని గురించే చెప్పుకుంటారు.. ఫలానా నటుడు, నటి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని..అని సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటాయి.. ఓ పది పదిహేను రోజులు.. గట్టిగా ఓ నెల రోజులు ఈ వ్యవహారం చుట్టే అందరి దృష్టి ఉంటుంది. బెయిల్ ఇచ్చేది లేదంటారు..ప్రశ్నలు, విచారణలు, అబ్బో ఒకటేమిటి…ఇవాళో, రేపో ఏకంగా శిక్ష పడుతుందనే…
మన టాలీవుడ్ ఫిల్మ్మేకర్ల పరభాష భామల మోజు గురించి అందరికీ తెలిసిందేగా! ఎంత ఖర్చైనా పర్లేదు.. ఇతర రాష్ట్రాల నుంచి కథానాయికల్ని ఇంపోర్ట్ చేసుకుంటారే తప్ప, లోకల్ ట్యాలెంట్‌ని పెద్దగా పట్టించుకోరు. ఇబ్బడిముబ్బడిగా వాళ్ళు విచిత్రమైన డిమాండ్స్ చేసినా సరే, వాటిని తీర్చేందుకు సిద్ధమైపోతారు. మనోళ్ళ ఈ వీక్నెస్ చూసే.. పరభాష భామలు క్యాష్ చేసుకుంటుంటారు. సరిగ్గా మానుషీ ఛిల్లర్ కూడా అదే చేయాలనుకుంది. ఆఫర్స్ కోసం తనని వెతుక్కుంటూ వచ్చారు కాబట్టి, భారీగా దండుకోవాలని చూసింది.…
బాలీవుడ్లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న భామల్లో కంగనా రనౌత్ ఒకరు. ఈమెను అక్కడ లేడీ సూపర్‌స్టార్‌గా కూడా పిలుస్తుంటారు. వివాదాల సంగతి అటుంచితే, ఈ అమ్మడి సినిమాలు మాత్రం మంచి బిజినెస్ చేస్తాయి. కనీసం వారం, పది రోజుల వరకు కాసుల వర్షం కురిపిస్తాయి. నెగెటివ్ టాక్ వచ్చినా సరే, ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా సినిమాలు చెప్పుకోదగ్గ వసూళ్ళను రాబడుతాయి. కానీ, ధాకడ్ మాత్రం అందుకు భిన్నంగా డిజాస్టర్ రన్ కొనసాగిస్తోంది. రిలీజ్‌కి ముందు వచ్చిన…
కొంతకాలం నుంచి భారత చిత్రసీమలో సౌత్ vs నార్త్ పోరు జరుగుతోన్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే స్టార్స్‌కి ఆ విషయమై తరచు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నటుడు సోనూసూద్‌కి కూడా సౌత్ vs నార్త్ అంశంపై ప్రశ్నలు ఎదురవ్వగా, తాజాగా అతడు స్పందించాడు. ‘‘హిందీ చిత్రాల్ని కాదనుకొని, దక్షిణాది సినిమాల్ని అంగీకరించడంపై నాకు తరచూ ప్రశ్నలు ఎదురయ్యేవి. అయితే.. నేను ఏం చేస్తున్నానన్న విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఏ భాషలో సినిమాలు చేసినా,…
గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాల దండయాత్రతో సమతమవుతోంది బాలీవుడ్. పుష్ప, ట్రిపుల్ ఆర్, కెజియఫ్ చాప్టర్ టు.. ఇలా బ్యాక్ టు బ్యాక్, బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాయి. దాంతో సౌత్ సినిమాల ధాటికి తట్టుకోలేకపోయాయి హిందీ సినిమాలు. కానీ ఇటీవల వచ్చిన ఓ సినిమా మాత్రం బాలీవుడ్‌కి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా..? అల్లు అర్జున్ పుష్ప 100 కోట్లు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా వచ్చిన ట్రిపుల్ ఆర్…
రీసెంట్గా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకోవడంతో.. హాట్ బ్యూటీ రష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. మరింతగా అట్రాక్ట్ చేసేందుకు ట్రై చేస్తోంది. దాంతో కొంచెం హాట్‌గా కనిపించి ఔరా అనిపించింది. అయితే హాట్‌గా కనిపించడానికి నానా తంటాలు పడింది. దాంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. మరి రష్మిక టార్గెట్ ఏంటి.. ఏ విషయంలో ఇబ్బంది పడింది..? తెలుగులో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న…
స్వాతంత్ర వీర్ సావర్కర్ 139వ జయంతి సందర్భంగా శనివారం ఆయన బయోపిక్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. వినాయక దామోదర్ సావర్కర్ బయోపిక్ లో బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఫస్ట్ లుక్ ను చూడగానే అచ్చు సావర్కర్ ను చూసినట్టే ఉందంటూ ఆ మహానాయకుడి అభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ నూ…