Samantha : విడాకులపై వివరణ తప్పదా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ బ్యూటీ సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత.. ఇప్పటి వరకు ఇండైరెక్ట్‌గా తప్పితే.. డైరెక్ట్‌గా ఎప్పుడు స్పందించలేదు. అయితే ఈ సారి మాత్రం విడాకులపై నోరు విప్పబోతోందా అంటే.. ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు ఓ ప్రముఖ షో వేదికగా మారబోతోందని తెలుస్తోంది. మరి నిజంగా సామ్ డివోర్స్ పై స్పందించిందా.. అసలు ఆ షోలో పాల్గొందా.. నిజమే అయితే విడాకుల వ్యవహారం చర్చకు వచ్చిందా.. అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
వివాహ బంధంతో నాలుగేళ్లు కలిసున్న నాగ చైతన్య, సమంత.. ఊహించని విధంగా విడాకులు తీసుకొని.. ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. దాంతో ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఇవేనంటూ.. ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఇప్పటికీ సందర్భం వచ్చినప్పుడల్లా.. చై, సామ్ డివోర్స్ వ్యవహారం తెరపైకి వస్తునే ఉంది. కానీ అటు సమంత గానీ, ఇటు చైతన్య గానీ.. ఏదో మాట వరసకు తప్పితే.. అసలు మ్యాటర్ మాత్రం చెప్పడం లేదు. దాంతో అసలెందుకు ఈ జంట విడిపోయారనేది.. ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. అయితే ఇప్పుడు ఇలాంటి వాటికి చెక్ పడబోతోందని తెలుస్తోంది. బాలీవుడ్ బడా దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా చేస్తోన్న’కాఫీ విత్ కరణ్’ షో.. ఇప్పటి వరకు ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే ఏడో సీజన్ మొదలు కాబోతోంది. అయితే ఈ సారి ఓటీటీలో ప్రసారం కాబోతోంది ఈ పాపులర్ షో. అయితే ఇప్పటి వరకు బాలీవుడ్ హీరో, హీరోయిన్లే ఈ షోలో అటెండ్ అయ్యారు. కానీ ఈ సారి మాత్రం సౌత్ స్టార్స్ టార్గెట్‌గా రాబోతోంది కాఫీ విత్ కరణ్. అందులో భాగంగానే.. తాజాగా ఈ షోలో సమంత కూడా పాల్గొన్నట్టు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రీసెంట్‌గా ఆమె షూట్‌లో పాల్గొందని.. విడాకుల విషయంపై కూడా నోరు విప్పిందని సమాచారం. దాంతో డివోర్స్ గురించి సమంత నిజంగానే క్లారిటీ ఇచ్చిందా.. అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Sanju Samson: భారత్, వెస్టిండీస్ సిరీస్.. అభిషేక్ శర్మను దాటేసిన సంజూ శాంసన్..
-
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
-
Abhishek Sharma: కొట్టింది 29 పరుగులే.. అయినా వరల్డ్ రికార్డ్ బద్దలుగొట్టిన కాటేరమ్మకొడుకు..
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..