బాలీవుడ్లో ఈ ఏడాది భారీ హిట్ అందుకున్న చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలపై వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘కింగ్స్, బాద్షాలు, సుల్తాన్లు ఉన్నంత కాలం బాలీవుడ్…
ఒకప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో బిజియెస్ట్ హీరోయిన్. ప్రతీ స్టార్ హీరో సినిమాలో కచ్ఛితంగా కనిపించేది. దర్శకనిర్మాతలందరూ ఈమె డేట్స్ కోసం క్యూలో నిల్చునేవారు. అలాంటి భామ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కనుమరుగైంది. చివరిసారిగా ‘కొండపొలం’ చిత్రంలో కనిపించిన ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఓవైపు ఫ్యాన్స్ ఈమె కోసం వేచి చూస్తుంటే.. ఈ భామ మాత్రం హిందీ సినిమాలు చేసుకుంటూ బాలీవుడ్లోనే సెటిలైపోయింది.…
సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలపై సోషల్ మీడియాలో వచ్చే రూమర్లు, నడిచే చర్చలు అన్నీ ఇన్నీ కావు. వాళ్లేం చేస్తుంటారు? ఎవరితో ఎఫైర్లో ఉన్నారు? అనే విషయాలే నెట్టింట్లో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ట్రోల్స్ కూడా వెలుగు చూస్తుంటాయి. తనపై అలాంటి ట్రోల్స్ రావడంతో కోపాద్రిక్తుడైన నటుడు రాకేశ్ బాపత్.. కర్ర విరగకుండా పాము చచ్చినట్టు ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అసలేం జరిగిందంటే.. బిగ్‌బాస్ షోలో ఉన్నప్పుడు శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టితో రాకేశ్…
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఎదిగి.. దక్షిణాది అన్ని భాషల్లోనూ స్టార్ డమ్ తెచ్చుకున్న సమంత బాలీవుడ్లో అడుగు పెట్టబోతోంది. అయితే.. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండో సీజన్, పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్‌తో ఉత్తరాది ప్రేక్షకులకు సమంత చేరువైన విసయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బాలీవుడ్లో సమంత అరంగేట్రం ఎప్పుడు అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే స్యామ్ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో తొలి సినిమా చేస్తుందని ఫుల్…
బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకొని పెళ్ళైన .. కాస్తకూడా సమయం లేకుండా అప్పటికంటే.. ఇప్పుడే బిజీ షెడ్యూల్ వుంది. తనకు పెళ్ళైనప్పటి నుంచి నేను చాలా ఫ్రీగా వున్నానని, ఏ రిలేషన్లో అయినా నమ్మకం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు దీపికా. ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ చాలా అవసరమని, ఇవి రెండూ లేకపోతే, ఆ బంధం ముందుకు వెళ్లలేదని అన్నారు. ఒక బంధం నిలుపుకోవాలంటే.. కొన్ని విషయాల్లో ఓపిక అవసరమంటూ దీపిక అన్నారు. కానీ.. పెళ్లయ్యాక అమ్మాయి…
బాలీవుడ్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్లలో సుశ్మితా సేన్ ఒకరు. ఈమె సినిమాల పరంగా కన్నా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లోకెక్కుతుంది. సాధారణంగా మహిళలు ఒక వయసుకి వచ్చాక, పెళ్లి చేసుకొని సెటిలవుతారు. కానీ, సుశ్మితా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంది. మీడియా తారసపడినప్పుడల్లా.. పెళ్లెప్పుడు? అసలెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? అనే ప్రశ్నలు ఈమె ఎదురవుతూ ఉంటాయి. వీటిపై ఎప్పుడూ పెద్దగా స్పందించని సుశ్మితా.. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ట్వింకిల్…
‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిన కుబ్రా సెయిట్.. కొన్ని రోజుల నుంచి సంచలన విషయాల్ని షేర్ చేసుకుంటూ నిత్యం వార్తల్లోకెక్కుతోంది. ఇటీవల తన కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఓ సభ్యుడు తనని లైంగికంగా వేధించాడంటూ ఈ అమ్మడు బాంబ్ పేల్చింది. అతని వల్లే వర్జినిటీ కోల్పోయానని కుండబద్దలు కొట్టింది. ఇప్పుడు తన ఓ వ్యక్తితో బెడ్ షేర్ చేసుకోవడం, అబార్షన్ చేయించుకోవడం వంటి షాకింగ్ విషయాల గురించి చెప్పుకొచ్చింది. తాను రాసిన ‘ఓపెన్…
సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా.. వివాదాస్పద అంశాలకు ఎంత దూరంగా ఉంటే, అంతే మంచిది. ఒకవేళ ఏదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరచాలనుకుంటే, అది అవతలివారి మనోభావాల్ని దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే.. లేనిపోని సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు అలాంటి పరిస్థితే వచ్చిపడింది. ఈమెకు ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో అంశంపై స్పందిస్తూ వార్తల్లోకెక్కే స్వర భాస్కర్..…
సోమవారం నటి ఆలియాభట్ ప్రెగ్నెన్సీ టాక్ ఆఫ్ ద సినిమా వుడ్స్ అయింది. దాంతో పెళ్ళయిన రెండు నెలలకే ఎందుకు అలియా, రణ్ బీర్ పిల్లల కోసం సిద్ధపడ్డారన్నది ఎవరికీ ఆర్థం కాని ప్రశ్నగా మిగిలింది. సెట్స్ మీద ఉన్న బాలీవుడ్ సినిమాలలో రెండు పూర్తయ్యాయి. మరొకటి సగానికి పైగా పూర్తయింది. ఇక హాలీవుడ్ సినిమా మాత్రం వదులుకోవాల్సిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమాలో ఆలియానే హీరోయిన్ అనే రూమర్స్ వచ్చాయి.…
రణ్ బీర్ కపూర్ ని పెళ్ళాడిన ఆలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రకటించిన వెంటనే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆలియా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రచారంలో ఆలియా పాల్గొనవలసి ఉంది. ఇది కాకుండా రెడ్ చిల్లీస్ పతాకంపై షారూఖ్ భార్య గౌరీఖాన్ తో కలసి ఆలియా నిర్మిస్తున్న ‘డార్లింగ్స్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందు థియేటర్ రిలీజ్ అనుకున్నప్పటికీ ప్రస్తుతం…