Sushmita Sen: ఆ రొంపి నుంచి అలా బతికి బయటపడ్డాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోయిన్లలో సుశ్మితా సేన్ ఒకరు. ఈమె సినిమాల పరంగా కన్నా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లోకెక్కుతుంది. సాధారణంగా మహిళలు ఒక వయసుకి వచ్చాక, పెళ్లి చేసుకొని సెటిలవుతారు. కానీ, సుశ్మితా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంటుంది. మీడియా తారసపడినప్పుడల్లా.. పెళ్లెప్పుడు? అసలెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? అనే ప్రశ్నలు ఈమె ఎదురవుతూ ఉంటాయి. వీటిపై ఎప్పుడూ పెద్దగా స్పందించని సుశ్మితా.. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘ట్వీక్ ఇండియా: ది ఐకాన్స్’ కార్యక్రమంలో స్పందించింది.
‘‘అదృష్టవశాత్తు నేను నా జీవితంలో కొందరు ఆసక్తికరమైన వ్యక్తుల్నే కలిశాను. మొదట్లో వారితో ప్రయాణం బాగానే అనిపించింది. కానీ, కాలక్రమంలో వాళ్లు నా అంచనాల్ని అందుకోలేదు. ఒక దశకు చేరుకున్నాక వాళ్లు నన్ను నిరాశపరిచారు. అందుకే, పెళ్లిదాకా వెళ్లలేదు’’ అని సుశ్మితా వెల్లడించింది. నిజానికి తనకు మూడుసార్లు పెళ్లి చేసుకునే పరిస్థితి ఏర్పడిందని.. వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లానని తెలిపింది. కానీ.. ఆ దేవుడు తనని రక్షించాడని, తనతో పాటు తన పిల్లల్ని కాపాడుతూ వస్తున్నాడని చెప్పింది. ఎలాంటి చెడు బంధంలోకి వెళ్లనివ్వకుండా, ఆ దేవుడు సురక్షితంగా చూసుకుంటున్నాడని వెల్లడించింది. పెళ్లిని చెడు బంధంతో పోల్చిందంటే, తన జీవితంలోకి వచ్చిన వాళ్లు సుశ్మితాని ఎంతలా బాధ పెట్టి ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
Also Read
తనకు పెళ్లి జరగకపోవడం వెనుక పిల్లలు కారణం కాదని, వాళ్లకు ఎలాంటి సంబంధమూ లేదని సుశ్మితా పేర్కొంది. తన జీవితంలోకి వచ్చిన ప్రతిఒక్కరినీ పిల్లలు స్వీకరించారని, సమానమైన గౌరవంతో పాటు ప్రేమ ఇచ్చారంది. కాగా.. 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్న సుశ్మితా, 2000 సంవత్సరంలో రెనీని, ఆ తర్వాత 2010లో అలీసాను దత్తత తీసుకుంది. 1996లో వచ్చిన ‘దస్తక్’ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ.. కొన్నాళ్లు ఇండస్ట్రీని ఏలింది. ఇప్పుడు వెబ్ సిరీస్‌లలో సత్తా చాటుతోంది.
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!