బాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడేలా చేసింది ఓవార్త. ఓస్టార్ జంటను చంపేస్తా అంటూ బెదిరింపురావడం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ను చంపేస్తా అంటూ బెదిరింపు లేఖ రావడం మరువక ముందే మరో స్టార్ జోడీకి చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులు సంచలనంగా మారింది. ఇంతకూ ఆ స్టార్ జోడి ఎవరంటే.. బాలీవుడ్ క్రేజీ స్టార్లుగా వెలుగొందుతున్న కత్రినా, విక్కీ. వీరిద్దరు ఇటీవలే వివాహం చేసుకుని ఆనందంగా గుడుపుతున్నారు. చాలా హ్యాపీగా అటు ఫిల్మ్ కెరీర్‌ను, ఇటు వివాహ జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. వారిద్దరి ఫిల్మ్ కమిట్మెంట్ తో బిజీ బిజీగా ఉన్నారు. అయినా టైం కేటాయించుకుని ఈ మధ్యే రీసెంట్‌గా మాల్దీవులకు కూడా వెళ్లి ఎంజాయ్ చేసారు. కత్రినా పుట్టినరోజు సందర్భంగా అక్కడే గ్రాండ్ పార్టీ చేసుకున్నారు. అక్కడ ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో..నెట్టింట వైరల్ అయ్యారు.
ఇదంతా ఇలా వుంటే.. ఈ స్టార్ జోడీకి ఇన్‌స్టా వేదికగా బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ఓ ఆగంతకుడు విక్కీని చంపేస్తా అంటూ.. కత్రినకు ఇన్ స్టాలో వార్నింగ్ చేశాడు. దీంతో షాక్ తిన్న కత్రినా, విక్కీ ముంబయ్‌లోని శాంతాక్రూజ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియాలో బెదిరింపుల గురించి చెప్పి, ఫిర్యాదు చేసారు. అయితే.. ఈబెదిరింపులను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈకేసును IT Act కింద నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేసి, త్వరలోనే నిందితున్ని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.