ఎన్టీఆర్ జిల్లా, బోదవాడలోని సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంఓ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి దాదాపు 15 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు.
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. హాపూర్ జల్లా ఓ ఎలక్ట్రానిక్ పరికారాలను తయారీ చేసే ఓ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. హాపూర్‌లోని ధౌలానా పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్ ఫ్యాక్టరీ బాయిలర్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది కార్మికులు గాయపడ్డారు. ఘటన జరిగిన ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక…