ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. హాపూర్ జల్లా ఓ ఎలక్ట్రానిక్ పరికారాలను తయారీ చేసే ఓ కంపెనీలో శనివారం భారీ పేలుడు సంభవించింది. హాపూర్‌లోని ధౌలానా పారిశ్రామిక ప్రాంతంలోని కెమికల్ ఫ్యాక్టరీ బాయిలర్‌లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మంది కార్మికులు గాయపడ్డారు. ఘటన జరిగిన ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగాయి. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. హాపూర్ జిల్లా కలెక్టర్ మేఘా రూపమ్, ఇతర అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హాపూర్ ఐజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు ఆయన కార్యాలయం హిందీలో ట్వీట్ చేసింది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాలని..బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కార్యాలయం వెల్లడించింది.