తెలంగాణ రైతుల పక్షాన తాము పోరాడుతున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సాంప్రదాయ పంటలను వదిలేసి ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు చెప్పినందుకు రైతులు వరి పంటకు అలవాటు పడ్డారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటుందని మండిపడ్డారు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 100 శాతం న్యాయం చేయలేవు. పంజాబ్ లో 100 శాతం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతుందన్నారు జగదీష్ రెడ్డి. కేంద్రం ఎటువంటి…
తెలంగాణలో హాట్ హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. గాంధీ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రేవంత్ కేసీఆర్ పై తీవ్రంగా స్పందించారు. పంచాంగ పఠనం, ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతుల జీవితంపై మరణ శాసనం రాశాడు కేసీఆర్ అన్నారు రేవంత్. కోడికి ధర తక్కువ.. మసాలాకే ధర ఎక్కువ అయ్యిందంటూ పెట్రోల్, డీజిల్ ధరల్ని ప్రస్తావించారు. లీటర్ పెట్రోల్ నిజానికి 50 రూపాయలకే వస్తుంది. కానీ, కేసీఆర్ 35 రూపాయలు, మోడీ 30 రూపాయలు…
ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణపర్వం కొనసాగుతూనే ఉంది… రాష్ట్రాలను కేంద్రం తప్పుబడుతుంటే.. తప్పంతా కేంద్రానిదే అంటున్నాయి తెలంగాణ సహా పలు రాష్ట్రాలు.. అయితే, ఈ నేపథ్యంలో బాయిల్డ్ రైస్‌పై మరోసారి తన విధానాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని లోక్‌సభలో స్పష్టం చేసింది కేంద్రం.. ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి…
బాయిల్డ్ రైస్ ఎవరూ ఉపయోగించరు. పిల్లలు కూడా బాయిల్డ్ రైస్ తినడం లేదు. ఆయా రాష్టాలు ఉత్పత్తి తగ్గించాయ్. 3400 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ కోసం 2014లో కేంద్రం ఖర్చు చేసింది. 26,600 కోట్లు గత ఏడాది ఖర్చు పెట్టాం. బాయిల్డ్ రైస్ వేర్ హౌజెస్ లో నిల్వ ఉంటున్నాయి.రా రైస్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. కోటా ఇంకా ఇవ్వలేదు.బాయిల్డ్ రైస్ కు ఆదరణ లేదు. హుజురాబాద్ ఎన్నికల తర్వాతే బాయిల్డ్ కొనాలనే అంశం…
కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు. బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా కేసీఆర్ వ్యవహరించాలి. రైతులకు మేలు జరిగేలా వ్యవహరించాలన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం దగ్గర ధాన్యం సేకరణ పాలసీ వుంది. దేశంలో బాయిలర్ రైస్ వాడడం లేదు. తెలంగాణలో ఎవరూ తినడం లేదు. ఏ రైస్ తినాలో ప్రజలపై వత్తిడి తీసుకురాలేం. ఆహార భద్రత కింద 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నాం అన్నారు కిషన్ రెడ్డి.