సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. కరీంనగర్ లో బెయిల్ పై విడుదల అయిన మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మీడియా పై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి భయపెడుతున్నారని మండిపడ్డారు. జిల్లాల సంఖ్య పది నుంచి 33కి, జోన్లు రెండు నుంచి ఏడుగా మార్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి సవరణ చేసి…
బీజేపీ నాయకురాలు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభకు హై కోర్టులో ఊరట లభించింది. బొడిగె శోభను రూ. 25 వేల పూచీకత్తుతో విడుదల చేయాలని పోలీసులను తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది. అయితే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగుల బదీలీ విషయంలో ఉన్న జీవో నెంబర్ 317 ను సవరించాలని జాగరణ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షలో బండి సంజయ్, బొడిగె శోభతో సహా మొత్తం 17 మందిని…