మెగాస్టార్ చిరంజీవి, బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్న మెగా154 సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. 2023 సంక్రాంతి కానుకగా మూవీ రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ‘జనవరి 2023,సంక్రాంతి కి కలుద్దాం’ అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. టైటిల్ తో పాటు టీజర్ త్వరలో విడుల చేస్తామంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సముద్రం, అందులో పడవలు కనిపిస్తుండగా చిరంజీవి చేతిలో లంగరుతో ఉన్న పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ…
మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ‘వాల్తేరు వీరయ్య’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమలో.. మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రవితేజ దాదాపు 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని కూడా వార్తలొచ్చాయి. అయితే రీసెంట్‌గా ఆచార్య ఎఫెక్ట్ వల్ల.. కాస్ట్ కటింగ్ కోసం రవితేజను తప్పించారని వినిపించింది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని ప్రేక్షకులను నిరాశపర్చిన విషయం విదితమే. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ మెగాస్టార్ తదుపరి సినిమాపై పడిందా..? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమాల్లో మెగా 154 ఒకటి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ…
Mega154 కోసం మెగాస్టార్ యాక్షన్ లోకి దిగారు. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘మెగా154’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా చిరంజీవి, ఫైటర్స్‌పై ఉత్కంఠభరితమైన యాక్షన్ ఎపిసోడ్‌తో బృందం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం. యాక్షన్ బ్లాక్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షించగా, హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లో మేకర్స్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తోన్న శృతి హాసన్ త్వరలో సెట్స్‌పైకి…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాలను లైన్లో పెట్టడమే కాదు షూటింగ్ కూడా అంతే వేగంగా పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన “ఆచార్య” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్”, మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీస్ ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే ఇటీవల వెంకీ కుడుములకు…
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో జోష్ పెంచుతున్నాడు. ఇప్పటికే ఆచార్య విడుదలకు సిద్దమవుతుండగా లూసిఫర్ సెట్స్ మీద ఉంది.ఇక వీటితో పాటు బాబీ తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్న చిరంజీవి నేడు దానికి కూడా కొబ్బరికాయ కొట్టారు. మెగాస్టార్ 154వ సినిమా తెరకెక్కనున్న ఈ చిత్రం నేడు పూజాకార్యక్రమాలతో మొదలయ్యింది. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ మెగాస్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. కళ్ళకు గాగుల్స్, చేతిలో సిగరెట్ తో మాస్ లుక్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ చిత్రాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’, మోహన్ రాజా డైరెక్షన్ లో ‘గాడ్ ఫాదర్’ రూపొందనుంది. అంతేకాదు త్వరలో కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించే మాస్ ఎంటర్‌టైనర్ ను కూడా ప్రారంభించబోతున్నారు. మెగాస్టార్ ను బాబీ స్క్రిప్ట్‌తో బాగా ఆకట్టుకున్నాడు. ఈ పప్రాజెక్ట్ కు ‘వాల్తేర్ వీర్రాజు’ అనే టైటిల్ ను ఖరారు చేస్తారని…
విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన సినిమా ‘లాభం’. యస్.పి. జననాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జగపతిబాబు మెయిన్ విలన్ గా నటించగా సాయి ధన్సిక కీలక పాత్రలో కనిపించనున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 9న ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘లాభం’ తెలుగు వెర్షన్‌కి సంబంధించి ఫస్ట్ లుక్ ను దర్శకుడు బాబీ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ వేడుకలో…
మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇవాళ అభిమానులందరికీ ఫుల్ మీల్స్ దక్కినట్టు అయ్యింది. ‘ఆచార్య’ నయా పోస్టర్ రిలీజ్ దగ్గర నుండి రెండు కొత్త సినిమాల టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు మరో మూవీకి సంబంధించిన పోస్టర్ సైతం విడుదలైపోయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, బాబీ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ మూవీకి సంబంధించిన విశేషాలను మాత్రం చెప్పి, చెప్పకుండా దాటేశారు. మొదట తెలిపిన టైమ్ కు కేవలం పోస్టర్ ను మాత్రం విడుదల చేశారు.…