Mega154: అటు ‘వాల్తేరు వీరయ్య’.. ఇటు ‘వైజాగ్ రంగరాజు’ ఫ్యాన్స్‌కు పూనకాలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega154: మెగాస్టార్ సినిమా నుంచి మెగా అప్ డేట్ వచ్చిందండోయ్.. చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్లో మాస్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు రవితేజ ఎలాంటి పాత్ర పోషిస్తున్నారన్న విషయం పై ఓ వార్త వైరలవుతోంది. కథ ప్రకారం చిరంజీవికి తమ్ముడిగా రవితేజ నటిస్తున్నారని టాక్. అవుట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు రవితేజ. పాత్ర పేరు కూడా రివీల్ అయ్యింది. వైజాగ్ రంగరాజుగా రవితేజ కనిపిస్తారట. నిమాలో అతడి రోల్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారట దర్శకుడు బాబీ. చిరంజీవి.. వాల్తేర్ వీరయ్య అనే పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్సమెంట్ లేదు. కానీ రవితేజ పోలీస్ క్యారెక్టర్స్‌లో ఓ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తుంటారు. ఈసారి కూడా ఆయన రెచ్చిపోయారని టాక్. దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక రవితేజ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘ధమాకా’ అనే సినిమాలో నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
Also Read
Read Also: Prabhas: అభిమానులకు గుడ్ న్యూస్.. డ్యూయల్ రోల్లో ప్రభాస్
ఇందులో రవితేజ రెండు డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్నారు. హీరో క్యారెక్టర్ రెండు డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడి ఉంటుందని.. ఈ క్యారెక్టర్ చుట్టూనే సినిమా కథ తిరుగుతుందని తెలుస్తోంది. ఓ కంపెనీకి సీఈవోగా కనిపించే రవితేజ.. మరోవైపు ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా కూడా కనిపిస్తాడట. అయితే కంపెనీ సీఈవో అనుకొని పొరపాటున మిడిల్ క్లాస్ వ్యక్తిని రౌడీలు కిడ్నాప్ చేయడం అనేదే ఈ సినిమాలో అసలు ట్విస్ట్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ‘పెళ్లి సందడి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీలీల.. రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్‌గా వ్యవహరించనున్నారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!