కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనే కాదు తన శవం కూడా భారతీయ జనతా పార్టీలో చేరదన్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జితిన్ ప్రసాద తాజాగా బీజేపీలో చేరడంపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జితిన్ ప్రసాద నిర్ణయం వ్యక్తిగతం అంటూనే.. ఇన్నేళ్లు వ్యతిరేకించిన పార్టీలో ఎలా చేరతారంటూ ప్రశ్నించారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికపై లేఖ రాసిన నేతల్లో కపిల్ సిబల్ కూడా ఒకరు.. అలాంటి…
బీజేపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.. ఇక, బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది.. ఈ నెల 14వ తేదీన బీజేపీలో చేరనున్నారు ఈటల.. ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.. ఈటలతో పాటు మరికొందరు నేతలు కూడా బీజేపీలో చేరనున్నారు.. కాగా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన ప్రాతినిథ్యం వహించిన హుజూరాబాద్ లో కాస్త…
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై ఫైర్ అయ్యారు శాసనమండలి మాజీ ఛైర్మన్, టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి… ఈటల రాజేందర్ తనని తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప- హత్యలుండన్నారు.. ఈటలకి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని మీడియా చిట్‌చాట్‌లో గుర్తుచేసిన గుత్తా.. మరోవైపు.. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందన్నారు.. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పరాభవం ఎదురయ్యిందన్న ఆయన.. ఈటల ఆత్మరక్షణ కోసం…
ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు… రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరనున్న ఆయన.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.. ఇక, రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు.. డిసెంబర్ లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన ఏపీ సీఎం జగన్.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై దృష్టిపెట్టారు. ఈ అంశంలో సహకారం కోరేందుకు.. హోమ్ మంత్రి అమిత్…
ఇటీవల అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలోనూ అస్సాం నిలబెట్టుకోవడం తప్ప మరెక్కడా గెలవలేకపోవడం, మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌పై ఎంతగా కేంద్రీకరించినా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించడం బిజెపి దూకుడుకు పగ్గాలు వేసింది. ఇదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విస్తరించడం, వాక్సిన్ సరఫరాలో తీవ్ర కొరత కూడా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరగడానికి కారణమైనాయి. మోడీ పాలన ఏడో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్న బిజెపి ఆలోచనలు అమలు కాకపోగా…
రాష్ట్రం ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చినా.. అక్కడ వరాల జల్లు కురిపించడం సీఎం కేసీఆర్ సాంప్రదాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఈటల రాజేందర్… కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోనీ ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్నాను.. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నా.. నా రాజీనామా తర్వాత అయినా పెన్షన్లు, పింఛన్లు వస్తాయని భావిస్తున్నానన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పెన్షన్, రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారందరీకీ వెంటనే ఇవ్వాలని..…
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ.. ఓవైపు, ఎస్పీ, బీఎస్పీలు కూడా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.. ఇక, యూపీపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ప్రియాంకాగాంధీ.. అయితే, యూపీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది.. పార్టీ సీనియర్ నేత.. గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉన్న కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్.. కాంగ్రెస్ పార్టీకి…
ప్రధాని మోడీపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు బిజేపి నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ కొరత 135 కోట్ల పైన జనాభా ఉన్నప్పుడు సహజం ఒవైసీ జీ.. ప్రపంచం మొత్తం కూడా చాలావరకు ఇట్లాంటి పరిస్థితులే ఉన్నాయని చురకలు అంటించారు విజయశాంతి. “2020 జూలై లో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్ కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ TRS…
ఈటల.. కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లడతా అని బీజేపీలో చేరడం ఎంటో అర్దం కావడం లేదు అని జీవన్ రెడ్డి అన్నారు. తెరాస అవినీతికి రక్షణగా నిలిచింది బీజేపీ. ఈటల బీజేపీలో కలుస్తారని నేను ఊహించలేదు. ఆయన బలహీనత బయట పడింది. ఈటల బీజేపీలో చేరుతూ తన వ్యక్తిత్వం కోల్పోయారు. ఇక కాంగ్రెస్ నీ ఎవడో నడపడు. కాంగ్రెస్ నీ నడిపిస్తుంది రాహుల్ గాంధీ. ఈటల స్థాయిని స్వయంగా ఆయనే తగ్గించుకున్నారు. నియోజక వర్గానికి పరిమితం అయ్యాడు.…
సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ఫొటోను ఆ పార్టీ ట్విట్టర్లో పెట్టి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై యూపీ బీజేపీ విభాగం స్పందించింది. చాలా మంచి విషయం చెప్పారనీ, గతంలో అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ బీజేపీ వ్యాక్సిన్‌గా పేర్కొంటూ విమర్శలు చేశారని, కానీ, ఇప్పుడు అదే వ్యాక్సిన్‌ను ములాయం సింగ్ తీసుకున్నారని, త్వరలోనే అఖిలేష్ యాదవ్ తో పాటుగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా వ్యాక్సిన్ తీసుకుంటారని…