తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది… సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి సీనియర్ దళిత నేతలు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులకు ఆహ్వానాలు వెళ్లగా.. ఈ సమావేశానిక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం,…
నల్గొండ జిల్లా:-తెలంగాణ పీసీసీ నియామకంపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీగా ఉన్న ఉత్తమ్ కుమార్ పోయి… ఉత్తర కుమారుడు వచ్చిండని… ఎవరు వచ్చినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదని సెటైర్ వేశారు. వచ్చే రెండేళ్లు.. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించడానికే సరిపోదని ఎద్దేవా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని… సమైక్య ఆంధ్ర నుంచే తెలంగాణకు నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు. పోతిరెడ్డిపాడు…
ఈటల రాజేందర్ రాకతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ… మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 30 న బీజేపీ రాష్ట్ర వర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర కార్యవర్గం. ఈ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక, బండి సంజయ్ జిల్లాల పర్యటనతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చ జరుగనుంది. జూలై 1 నుంచి 8 వరకు బండి సంజయ్ జిల్లాల పర్యటన చేయనున్నారు.…
హుజురాబాద్ లోని తెరాస కార్యకర్తల సోషల్ మీడియా సమావేశానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా బాల్క సుమన్ మాట్లాడుతూ… హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ కు ఈటల రాజేందర్ రాసినట్లు లెటర్ ప్యాడ్ తో ఉన్న లెటర్ నిజమైన దీ, దీన్ని ఫేక్ లెటర్ గా బీజేపీ చేస్తున్న ప్రచారం కల్పితం. ఈటల రాజేందర్ లెటర్ ఫెక్ అని దమ్ముంటే హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయ ప్రాంగణంలో…
దేశంలో కొత్త ఫ్రంట్ పై చర్చలు మొదలయ్యాయి. ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు ఫ్రంట్ పై అడుగులు వేస్తున్నారు. మరి దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు ఎటువైపు? 2019 ఎన్నికల ముందు యాంటీ మోడీ ఉద్యమం చేసిన టీడీపీ చీఫ్ ఇప్పుడు ఏం చేస్తారు? మోడీ వ్యతిరేక జట్టుతో కలిసే ధైర్యం చేస్తారా? లేక మా రాష్ట్రం మా రాజకీయం అని ఏపీకే పరిమితం అవుతారా? 2019 ఎన్నికల టైమ్‌లో మోడీకి వ్యతిరేకంగా ఉద్యమంటీడీపీ జాతీయ రాజకీయాలపై మౌనం దేశంలో…
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక సందర్భంగా నేతల మధ్య పొరపచ్చాలు వచ్చాయా? ఆయన చేరికను తమ ఖాతాలో వేసుకునేందుకు కొందరు ప్రయత్నించారా? ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా.. హుజురాబాద్‌లో ఇంఛార్జ్‌ల నియామకం జరిగిందా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎవరు ఎవరికి చెక్ పెట్టారు? ఈటల చేరిక సందర్భంగా జరిగిన పరిణామాలపై చర్చ! తెలంగాణ బీజేపీలో బయటకు అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తోందట. సీనియర్ల మధ్య పడటం…
ఏపీలో బీజేపీ రోడ్డెక్కుతోంది. రానున్న రోజుల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రకటిస్తోంది. అయితే జనసేనాని మాట ఎక్కడా వినిపించడం లేదు. కీలక పరిణామాలపై ప్రకటనల ద్వారా స్పందించే పవన్ కల్యాణ్.. ఇప్పుడు దాన్నీ పక్కన పెట్టేశారు. ఇంతకీ సేనాని మౌనానికి కారణం ఏంటి? సినిమాలతో బిజీగా ఉన్నారా… కోవిడ్‌తో రాజీ పడ్డారా? ఏపీలో పెరిగిన బీజేపీ కార్యక్రమాలు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం జోరు తగ్గింది. ఇదే సమయంలో మరో ప్రతిపక్షం బీజేపీ ప్రజా వ్యతిరేక…
నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ, మీకు కూడా గుణపాఠం చెబుతా అంటూ టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పర్యటిస్తూ.. రానున్న ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.. వరుసగా ఆరు సార్లు విజయం సాధించా.. ఈసారి హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురవేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మా బీజేపీ నేతలు వచ్చి…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది రియలో.. ఏది వైరలో తెలియని పరిస్థితి… కొందరు కేటుగాళ్లు ఇష్టంవచ్చినట్టుగా తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు.. అది తెలియకకొందరు.. తెలిసి మరికొందరు షేర్ చేస్తూ.. అందులో భాగస్వాములు అవుతున్నారు.. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్, వైఎస్ షర్మిల ఫొటోలతో.. హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఓ తప్పుడు వార్త వైరల్ చేశారు కేటుగాళ్లు.. దీనిపై వైఎస్ షర్మిల అనుచరులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. బుధవారం రోజు సోషల్ మీడియాలో మేం పెట్టబోయే…
హుజరాబాద్ ఉప ఎన్నిక కోసం మండల ఇంచార్జ్ లను ప్రకటించింది బీజేపీ. హుజురాబాద్ టౌన్ ను ఇంచార్జ్ గా ఎమ్మెల్యే రఘునందన్ రావును నియమించగా హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట కు ఎంపీ అరవింద్.. జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ను నియమించింది. అలాగే వీణవంక- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇల్లంతకుంట- మాజీ ఎంపీ సురేష్ రెడ్డి కమలాపూర్- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను…