ఢిల్లీ: దేశంలోని 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఏపీ బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ హరిబాబు కంభంపాటి మిజోరాం గవర్నర్‌గా నియామకమయ్యారు. అలాగే.. హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ నియామకం అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ గవర్నర్ గా దత్తాత్రేయ పనిచేస్తున్నారు.
read also : ఆసక్తికరంగా “మాలిక్” ట్రైలర్
అటు రాజేంద్రన్ విశ్వనాథ్ అర్లేకర్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియామకం కాగా… హర్యానా గవర్నర్ గా ఉన్న సత్యదేవ్ నారాయణ్ ఆర్యను త్రిపుర గవర్నర్‌గా నియామించారు. తవర్ చంద్ గెహ్లాట్ కర్ణాటక గవర్నర్ గా నియామకం కాగా… మంగూభాయ్ చాగన్‌భాయ్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా నియామకం అయ్యారు. పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై గోవా గవర్నర్‌గా నియామకం కాగా… రమేష్ బైస్‌ను జార్ఖండ్ గవర్నర్‌గా నియామకం అయ్యారు.