ఓవైపు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి.. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తున్నాయి.. ఈ తరుణంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మనివ్వమని స్పష్టం చేసిన ఆయన.. అందరికి ఉద్యోగాలు ఉంటాయి.. స్టీల్ ప్లాంట్‌ను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటు…
ఓవైపు ప్రభుత్వ భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధమవుతోన్న తరుణంలో.. మరోవైపు.. ఆ భూములు ఎవరూ కొనవద్దు.. హైకోర్టు విచారణ పూర్తి అయ్యేవరకు ఆగాలని సూచిస్తున్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి.. రేపటి కోకాపేట, ఖానామెట్ భూముల వేలం ఆపేందుకు హైకోర్టు నిరాకరించడంతో భూముల వేలానికి మార్గం సుగమం కాగా.. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్ లో 14.92 ఎకరాల భూముల వేలానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. అయితే, భూముల అమ్మకం విషయంలో ప్రభుత్వానికి హై కోర్టు మొట్టికాయలు…
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరేనని.. దానికి సంబంధించిన సర్వే నివేదికలు కూడా వచ్చాయని తెలిపారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు.. 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీజేపీలో ఈటల రాజేందర్ చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం.. అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈ రోజు వచ్చి…
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని అమిత్‌షా అన్నారు.. ఇందుకోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వస్తానని తెలిపారు ఈటల రాజేందర్.. అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల.. షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారని.. ఇందుకోసం ఎన్నిసార్లు అయినా తెలంగాణ వస్తా అన్నారని వెల్లడించారు.. ఇక, ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేసిన…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అలాగే హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరును వివరించనున్నారు. read also : వాహనదారులకు ఊరట… ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే ? అయితే……
పోలవరం నిర్వాసిత గిరిజనులపై సీఎం వైఎస్ జగన్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నారంటూ విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఇవాళ బీజేపీ నేతల బృందంతో కలిసి దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితుల కాలనీలు పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనులు 78 శాతం పూర్తయితే నిర్వాసితుల కాలనీలు 21శాతం మాత్రమే నిర్మాణం జరిగాయన్నారు.. దేవీపట్నం నిర్వాసితుల కాలనీల్లో కరెంటు కూడా లేక భయానక వాతావరణం నెలకొనిఉందన్న ఆయన.. నిర్వాసితుల ఇళ్లకు శ్లాబ్‌ని…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇవాళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయనను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం.. ఆయన కూడా రెడీగా ఉన్నట్టు వారి మాటల్లో అర్థం అవుతోంది.. కొండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. బీజేపీలో చేరడం ఖాయం అనే ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం కాంగ్రెస్ గూటికి చేరడానికే ఉత్సాహంగా ఉన్నారని అర్థం అవుతోంది.. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో…
ఆయనో మాజీ ఎంపీ. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి నెలలు గడుస్తున్నా.. భవిష్యత్ ప్రయాణం ఏంటో వెల్లడించలేదు. కాసేపు అటు.. మరికాసేపు ఇటు అన్నట్టు ఆయన ట్వీట్లు ఉంటున్నాయా? ఇంతకీ ఆయన ఆ గట్టున ఉంటారా.. ఈ గట్టున రిలాక్స్ అవుతారా? క్రాస్‌రోడ్స్‌లోనే ఉండిపోయారా? కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. టీఆర్ఎస్లో ఉండగా.. చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. అధికార పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌లో రాజకీయంగా లక్ కలిసి రాలేదు. ఇక అక్కడ ఉండటం అవసరం లేదనుకున్నారో…
2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన శతృఘ్న సిన్హా ఆ తరువాత బీజేపీని వదలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో కూడా దూరంగా ఉంటున్న శతృఘ్న సిన్హా మరోసారి పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే, ఈసారి ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. Read: ఏపీ…
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు రేపు పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ముంపు గ్రామాల్లోను ఆయన పర్యటన కొనసాగనుంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితుల సమస్యలు తీర్చాలని.. వెంటనే పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. R&R ప్యాకేజీని వెంటనే అందజేయాలని సోము వీర్రాజు కోరారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్ యథావిధంగా పనిచేస్తుందన్న ఆయన.. దానిని అమ్మే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. ఇక కేసీఆర్,…