తెలంగాణ బీజేపీలో చేరిన వలస నేతలకు పెద్ద కష్టం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇతర పార్టీల నుంచి ఎవరైనా వలస వస్తే.. వారి స్థాయిని భట్టి గౌరవం ఇస్తాయి చేర్చుకున్న పార్టీలు. అక్కడ మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తారు నాయకులు. కానీ.. తెలంగాణ బీజేపీలో చేరిన మాజీ ప్రజాప్రతినిధులకు సీన్ రివర్స్‌లో ఉందట. మెడలో కండువా తప్ప చేతుల్లో పార్టీ పదవి ఒక్కటీ లేదు. బీజేపీ నుంచి ఒక్కో వికెట్ పడిపోతున్న సమయంలో వలస నేతలపట్ల కాషాయ శిబిరం ఆలోచన శ్రేణులను కలవర పెడుతోందట.
మీటింగ్‌కు వస్తే స్టేజ్‌పై నో కుర్చీ!
Also Read
ఇతర పార్టీల నుంచి వచ్చి కమలం తీర్థం పుచ్చుకున్న మాజీ ప్రజాప్రతినిధుల సంఖ్య తెలంగాణ బీజేపీలో చాంతాడంత ఉంది. వీరిలో కొందరు ఆయా పార్టీలలో ఒక వెలుగు వెలిగిన వారే. బీజేపీ మీటింగ్‌కు వస్తే మాత్రం నలుగురిలో నారాయణలా ఉండాల్సిందే. చేతిలో ఒక్క పదవీ లేకపోవడంతో స్టేజ్ కింద కూర్చోవాల్సి వస్తోంది. వేదికపైకి పిలుపు లేదు. దీంతో ఇబ్బందిగా ఫీలవుతున్నారట నాయకులు.
వలస నేతలకు బీజేపీ సిస్టమ్ మింగుడు పడటం లేదా?
తెలంగాణలో గత రెండు మూడేళ్లుగా ఇతర పార్టీల నుండి చేరికలు భారీగానే జరిగాయి. అందులో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇంకొందరు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉన్న ముఖ్య నాయకులు. రాజకీయ పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో వారంతా కాషాయ గూటికి చేరుకున్నారు. ఇలా వచ్చిన వారికి బీజేపీ సిస్టమ్ మింగుడు పడటం లేదని సమాచారం. బీజేపీలో జంబో కార్యవర్గాలు ఉండవు. ఏదైనా పార్టీ మీటింగ్ జరిగితే కీలక బాధ్యతల్లో ఉన్నవారికి మాత్రమే వేదికపై కుర్చీలు వేస్తారు. దీంతో పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేకుండా సమావేశాలకు వస్తోన్న మాజీ మంత్రులకు సైతం వేదిక కింద కుర్చీలు వేస్తున్నారు. పైగా ఇది పార్టీ ప్రోటోకాల్‌గా చెప్పడం వారు జీర్ణించుకోలేకపోతున్నారట.
read also : హుజురాబాద్‌లో హరీష్ అడుగుపెడితే ఉత్కంఠ తప్పదా?
కింద కూర్చోవాల్సి వస్తోందని సమావేశాలకు డుమ్మా!
ప్రెస్‌మీట్ పెట్టాలన్నా పార్టీ అనుమతి కావాల్సిందే!
సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే కొంతమంది వలస నాయకులు బీజేపీ సమావేశాలకు, పార్టీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌కు దూరంగా ఉంటున్నారట. తాము గతంలో ఉన్న పార్టీలో ఎంతో విలువ ఉండేదని.. బీజేపీలో స్టేజ్ కింద కూర్చోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారట. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా చేసిన సందర్భంగా ఈ విషయంపై కాషాయ శిబిరంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. తనకు కనీసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా పదవీ ఇవ్వలేదన్నది మోత్కుపల్లి విమర్శ. పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టాలన్నా అనుమతి కావాలి. ఇది పార్టీ రూల్. దీంతో బీజేపీలోకి వచ్చిన కొత్త కాపుల్లో అసహనం వ్యక్తం అవుతోందని సమాచారం. ఒకరిద్దరు నేతలు ఈ అంశంపై ఓపెన్ కామెంట్స్ కూడా చేశారు.
పార్టీ పదవులు లేకపోతే ఎలా అని కొందరు ప్రశ్న!
పదవులు లేకుండా తాము ఎలా పని చేస్తామని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. పదవులు లేకపోతే తమ మాట ఎవరు లెక్క పెడతారని నిలదీస్తున్నారట. పైగా పార్టీలో తామేం చేయాలో క్లారిటీ లేకపోతే ఎలా అన్నది వారి భావన. గతంలో చట్టసభల్లో పనిచేసిన దాదాపు 30 మంది నాయకులు వరకు ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఉన్నారు. వీరిలో కొందరికే పార్టీ పదవులు దక్కాయి. డీకే అరుణ, పొంగులేటి లాంటి వారికి జాతీయ స్థాయిలో బాధ్యతలు ఇచ్చారు. మాజీ మంత్రి విజయరామారావుకు రాష్ట్రస్థాయిలో పదవి ఉంది. మాజీ ఎమ్మెల్యేలు అరుణ తార, కొండేటి శ్రీధర్ , సోమారపు సత్యనారాయణలు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చూస్తున్నారు.
లేని కోర్ కమిటీలో సభ్యులా?
విజయశాంతితో సహా చాలామందికి బీజేపీలో ఎలాంటి బాధ్యతలు లేవు. ఇలాంటి వారిని కోర్ కమిటీ సభ్యులని చెబుతున్నా.. వాస్తవానికి కోర్ కమిటీ లేదు. బీజేపీకి నేతలు గుడ్‌బై చెప్పడం మొదలైన ఈ సమయంలో ఈ అంశంపై పార్టీ పెద్దలు సీరియస్‌గా దృష్టి పెట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!