భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి తన రాజకీయ భవిష్యత్ నిర్ణయం తీసుకున్నారు.. బీజేపీకి బైబై చెప్పిన తర్వాత.. ఆయన ఏ పార్టీలో చేరతారు? అనే చర్చ సాగుతోన్న నేపథ్యంలో… తాను టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు.. బీజేపీలో పరిస్థితిలు నాకు నచ్చలేదన్న పెద్దిరెడ్డి… కానీ, ఆ పరిణామాలపై విమర్శలు చేయదల్చుకోలేదన్నారు.. అయితే, ఈటల రాజేందర్.. బీజేపీలో చేరిన విషయంలో నాకు గౌరవం ఇవ్వలేదని కామెంట్ చేశారు.. ఇక, అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తా… హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు పెద్దిరెడ్డి.
also read: బీజేపీకి మరో షాక్.. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా
బీజేపీలో ఈటల రాజేందర్ చేరికను ఆది నుంచీ వ్యతిరేకిస్తూ వచ్చిన పెద్దిరెడ్డి.. పార్టీలో ఈటల చేరితే ప్రకంపనలు తప్పవని హెచ్చరించారు. అయినా, బీజేపీ.. ఈటలకు ఆహ్వానం పలకడంపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు.. బీజేపీ నుంచి హుజురాబాద్ స్థానాన్ని ఆశించారు పెద్దిరెడ్డి.. కానీ, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్.. టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీ గూటికి చేరడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి బీజేపీకి అంటిముట్టనట్టుగా ఉంటూ వచ్చారు.. మొత్తంగా ఇవాళ పార్టీకి రాజీనామా చేయడం.. టీఆర్ఎస్ చేరుతానని ప్రకటించడం జరిగిపోయాయి.