యాసంగి పంటను కొనే దమ్ము బీజేపీకి ఉందా ఉంటే ఎన్ని లక్షల టన్నుల కొంటారో తేల్చి చెప్పాలని, ఆ మాట చెప్పకుండా బీజేపీ డ్రామాలు ఆడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎఫ్‌సీఐ ఇచ్చిన లేఖ తమ దగ్గరుందని మంత్రి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత యుత ప్రభుత్వం అని అన్నారు. అన్ని లక్షల టన్నుల ధాన్యం కొంటామన్నారు. వానాకాలమే కేంద్రం మోసం చేసే ప్రయత్నం చేసిందని దానిని మేము రాజకీయంగా వాడుకోలేదని మంత్రి తెలిపారు. ప్రజల…
సిద్ధిపేట కలెక్టర్ రైతులపై మాట్లాడిన మాటలు నియంతలా ఉన్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దేవుళ్లతో సమానమని తెలిపారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రైతులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ – బీజేపీ ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. రైతుల పొట్టగొట్టి నడ్డి విరిచి రోడ్డు పాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వాలన్నారు. బండి సంజయ్, తెలంగాణ మంత్రులు…
బెట్టింగ్ అంటే క్రికెట్‌కే పరిమితం అనుకుంటాం. కాని ఎన్నికలప్పుడు కూడా భారీ బెట్టింగ్‌లు జరుగుతాయి. బెంగాళ్ అసెంబ్లీ ఎన్నికలా..హుజూరాబాద్ ఉప ఎన్నికలా అన్నది కాదు. టఫ్ ఫైట్ ఉంటే చాలు ఇలా అక్రమంగా వందల కోట్లు చేతులు మారుతాయి. పందెం రాయుళ్లకు ప్రాంతంతో సంబంధం లేదు. హోరా హోరి ఉందా.. లేదా, అన్నదే ముఖ్యం. ఇప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్ తెలంగాణే కాదు యావత్ దేశం దృష్టిని తన వైపు తిప్పుకుంది. అత్యంత ఖరీదైన ఎన్నికగా పరిశీలకులు…
హుజురాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ దాసోజు శ్రవణ్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కుసుమ కుమార్, హర్కర వేణుగోపాల్ తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. అడ్డగోలుగా అక్రమాలు, ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ హుజురాబాద్‌లో ఓటర్లను టీఆర్ఎస్,…
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఏక్ నిరంజన్‌గా మిగిలిపోయారా? ఇక చాలు అని బీజేపీ నేతలకు చెప్పేశారా? పోలింగ్‌కు మిగిలిన మూడు రోజులు ఆయన ఎవరిపై నమ్మకం ఉంచుతున్నారు? ఈటలలో వచ్చిన మార్పేంటి? లెట్స్ వాచ్..! బీజేపీ వారిని సర్దుకోవాలని చెప్పారా? హుజురాబాద్‌లో ఈ నెల 30 పోలింగ్. 72 గంటల ముందే ప్రచారానికి ఫుల్స్టాప్. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గమంతా కలియ తిరిగారు. ఉపఎన్నిక…
రైతుల పాలిట తెలంగాణ సీఎం రాబందులా మారారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… వరి బంద్ పథకాన్ని కేసీఆర్ స్టార్ట్ చేసిండు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. రైతులు వరి పండించకుండా ఏమి పంట వేయాలో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయలేదు.. ముఖ్యమంత్రి కన్ఫ్యూజ్ లో ఉంటాడు.. ఈయన కన్ఫ్యూజన్ ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు వేసిన బండి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి…
భారతీయ జనతా పార్టీ నేతలకు సవాల్ విసిరారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. సాగు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి సవాల్ విసిరారు.. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంట అయిన కొంటాం అని ఉత్తరం తీసుకురావాలన్నారు.. ఒక వేళ లెటర్ తీసుకురాకపోతే పదవులకు బండి సంజయ్, కిషన్ రెడ్డి…
బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 7గంటలకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉప ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. పోలింగ్ కు 72 గంటల ముందు నుంచే ఈ ప్రచారాలు ముగియడంతో మైకులు మూగబోయాయి. అయితే ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామారాజు, ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. బద్వేల్ నియోకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పోలింగ్…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నెల 28న హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిననాటి నుంచి నేటి వరకు కరీంనగర్ కమిషనరేట్, వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 ఏంసీసీ, 10 వీఎస్టీ లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో…
కాలంతో పాటు ఎన్నికల ప్రచారం తీరు కూడా మారింది. ఒకప్పుడు నాయకుడు ఊళ్లోకి వస్తున్నాడంటే జనం ఆయనను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్లేవారు. పనులు మానుకుని ఆయన రాకకోసం ఎదురుచూసేవారు. చెప్పింది శ్రద్ధగా వినేవారు. నాడు నాయకుల మాటల్లో ..హావ బావాలలో హూందాతనం ఉట్టిపడేది. ప్రజలతో మమేకమయ్యేవారు. ప్రత్యర్థులను విమర్శించాల్సి వస్తే సహేతుక ..సంస్కారవంతమైన భాష ఉపయోగించేవారు. కానీ నేడు ..నాయకుల తీరు చూస్తున్నాం.. నోరు తెరిస్తే బూతులు. అబద్దాలు. మర్యాద అన్నది మచ్చుకు కూడా కనిపించదు. నాడు…