హుజురాబాద్ ఉప ఎన్నికకు ఈ రోజు సాయంత్రంతో ప్రచార సమయం ముగియనుంది. దీంతో నాయకులు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. ఓటర్లను తిప్పుకునేందుకు చివరి ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీశ్రావు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్లో ఓటమి ఖాయమని తెలిసి ప్రస్టేషన్తో కొంతమంది ఫోన్లు పగలకొడుతున్నారట అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులు మాపై ఇచ్చిన ఫిర్యాదులతో మేము ఉన్న ఇండ్లను అధికారులు తనిఖీలు చేశారని ఆయన అన్నారు. మా ముఖ్యమంత్రి సభ పెట్టకుండా…
ఆంధ్రప్రదేశ్లోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నిక కాక రేపుతోంది.. బీజేపీ మండల అధ్యక్షుడు ఇప్పుడు వైసీపీలో చేరడం హీట్ పెంచుతోంది… ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికే తీసుకెళ్లింది భారతీయ జనతా పార్టీ.. అధికార వైసీపీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు జీవీఎల్, సునీల్ దేవధర్. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, హింస, బెదిరింపులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది…
హుజురాబాద్ ఉప ఎన్నికపై ఆ నియోజకవర్గ ప్రజలే కాదు.. యావత్తు రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది. భూ కబ్జా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆత్మగౌరవం అంటూ టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన నాటి నుంచే ఈటల హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హుజురాబాద్లో టీఆర్ఎస్…
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అన్ని అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ, మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అధికార పార్టీ యథేచ్చగా బెదరింపులకు పాల్పడుతుందని విమర్శించిన బీజేపీ ఎంపీ.. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డితో సహా బెదరింపులకు దిగుతున్నారని.. బీజేపీ మండల…
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వీవీఎస్ లక్ష్మణ్ సుపరిచితుడే. హైదరాబాద్ కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్… అంతర్జాతీయ క్రికెట్ కు అక్టోబర్ 12 వ తేదీ 2012 సంవత్సరంలో గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత… ఐపీఎల్ టోర్నీ జట్టు అయిన డెక్కన్ చార్జెస్ కు కెప్టెన్ గా వ్యవహరించారు లక్ష్మణ్. అయితే.. వయసు మీద పడుతుండటంతో.. ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టుకు మెంటర్ గా…
పంజాబ్లో కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఇప్పటికే కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని అనూహ్యమైన కారణాల వలన అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసిన తరువాత ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీజేపీలో చేరి పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, గత కొంతకాలంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా సిక్కు రైతులు పోరాటం చేస్తున్నారు. పంజాబ్…
హుజురాబాద్ ఉపఎన్నికపై బెట్టింగ్ కోట్లల్లో నడుస్తోంది. ఏ పార్టీ గెలుస్తుంది..ఎన్ని ఓట్ల తేడాలో గెలుస్తుంది..ఏఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు వస్తాయని పెద్దఎత్తున పందాలు కాస్తున్నారు. బెట్టింగ్ ప్రక్రియ ఆన్లైన్లో రహస్యంగా కొనసాగుతోంది. ఆఫ్లైన్లో సైతం బెట్టింగులు సాగుతున్నాయ్. హుజురాబాద్ ఉపఎన్నిక గెలుపు ఓటములపై కోట్లలో బెట్టింగులు సాగుతున్నాయి. తెలంగాణకు చెందిన వారితో పాటు వివిధ రాష్ట్రాల వారు సైతం బైపోల్పై ఆసక్తి చూపుతున్నారు. ఐపీఎల్ ముగియడంతో పందెంరాయుళ్లు ఉపఎన్నికపై బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. గత నెల నుంచే బెట్టింగ్…
దేశంలో సంచలనం సృష్టించిన పెగాసిస్ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. స్పైవేర్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి…ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా లేదా అన్న విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాము సంప్రదించిన నిపుణుల్లో కొందరు…వ్యక్తిగత కారణాలతో కమిటిలో భాగస్వాములు కాలేకపోయారని…ఈ…
టీఆర్ఎస్ విజయోత్సవ సభ తర్వాత ఒక్కొక్కరికి పిచ్చి పడుతుందని వ్యాఖ్యానించారు మంత్రి జగదీష్ రెడ్డి.. నల్గొండ కలెక్టరేట్లో యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే కేవలం 24 లక్షల టన్నులే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, సీఎం కేసీఆర్ చొరవతో 45 లక్షల టన్నులకు పెరిగిందని తెలిపారు.. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్లో వరి సాగు…
హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితం తెలంగాణ భవిష్యత్ రాజకీయ గమనాన్ని నిర్ధేశించనుంది. కేసీఆర్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అవినీతి ఆరోపణలతో రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా బలమైన ఓ ప్రచార నినాదాన్ని నిర్మించడానికి హుజూరాబాద్ విజయం దోహదం చేస్తుంది. టీఆర్ఎస్ గెలిస్తే పార్టీపై కేసీఆర్ ఉక్కు పిడికిలి మరింత బిగుసుకుంటుంది. సమీప భవిష్యత్తులో…