Chandrababu Serious: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. అయితే, ఈ సమావేశానికి నలుగురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
AIADMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కీలకమైన రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అన్నాడీఎంకే పార్టీ భావిస్తోంది. దీని కోసం ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుంది. మరోవైపు, పార్టీ నుంచి బహిష్కరించబడిన నేతలు ఓ. పన్నీర్ సెల్వం(ఓపీఎస్), టీటీవీ దినకరన్‌లు మళ్లీ ఎన్డీయే గూటికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎంకేకు వ్యతిరేకంగా సాంప్రదాయ అన్నాడీఎంకే ఓట్ బ్యాంక్…
Rahul Gandhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందేమాతరంపై చర్చ ప్రారంభించిన ఒక రోజు తర్వాత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహనం కోల్పోయారు. సభలో తన ప్రసంగానికి అడ్డు తగిలిన విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పంజాబ్ కాంగ్రెస్ నాయకురాలు నవజ్యోత్ సిద్ధూ సతీమణి కౌర్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమేనని.. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి కావడానికి ‘రూ. 500 కోట్ల సూట్‌కేస్’ అవసరమని.. అంత డబ్బు తమ దగ్గర లేదన్నారు.
Omar Abdullah: ఇండీ కూటమి పరిస్థితిపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ మిత్రపక్షాల్లో ఆందోళన పెంచాయి. ప్రతిపక్ష ఇండీ కూటమి ‘‘లైఫ్ సపోర్ట్‌పై ఉంది’’ అని అన్నారు. హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్‌లో ప్రతిపక్ష కూటమి గురించి మాట్లాడుతూ.. ‘‘ మనం లైఫ్ సపోర్ట్‌లో ఉన్నట్లే.
Yogi On Babri Masjid: ఢిల్లీలో ఈరోజు ( డిసెంబర్ 6న) జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. తన పదవీకాలంలో రాష్ట్రంలో "అల్లర్లు లేవు, కర్ఫ్యూ లేదు, అంతా బాగానే ఉంది" అని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
Babri Masjid: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ముందు మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో ‘‘బాబ్రీ మసీదు’’ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంచలనంగా మారింది.
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పాలక పార్టీ(బీజేపీ) ప్రధాన లక్ష్యంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై దుష్ప్రచారం చేయడం, ఆయన కించపరచమే అని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రచారం ఆయన వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నం జరుగోతందని ఆమె అన్నారు. నెహ్రూ నిర్మించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.