MLA Adinarayana Reddy: బీజేపీ ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి.. వైసీపీ నేతలకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అమరావతికి వస్తున్నా.. చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.. బుధవారం లేదా గురువారం అమరావతికి వస్తానని ప్రకటించారు.. ఈనెల 4న రాష్ట్రంలో అభివృద్ధి, వైసీపీ అవకతవకలపై మాట్లాడాను.. నాపై వ్యక్తిగతంగా రకరకాలుగా రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, రామసుబ్బారెడ్డి చాలా కామెంట్లు చేసారు.. నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పకుండా, జగన్ మెప్పు కోసం సంబంధం లేని మాటలు మాట్లాడారని…
జూబ్లీహిల్స్‌లో బీజేపీ సింగిల్ పాయింట్ అజెండాతో ముందుకు వెళ్తోందా? అదే అంశం మీద ఓట్లు కొల్లగొట్టాలనుకుంటోందా? దాని గురించే గట్టిగా చెప్పగలిగితే… ఓ వర్గం ఓట్లు సాలిడ్ అవుతాయని కాషాయ దళం లెక్కలేస్తోందా? ఇంతకీ ఉప ఎన్నిక బరిలో కమలం పార్టీ ప్లాన్ ఏంటి? ఓట్ల వేటలో పార్టీ ప్రయోగిస్తున్న ప్రధాన అస్త్రం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం పీక్స్‌కు చేరింది. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం పొగలు సెగలు పుట్టిస్తోంది. కలిసి వచ్చే ఏ…
ఓట్ల దొంగతనంపై మరోసారి లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో హోల్‌సేల్‌గా ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు.
Bihar Election 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతలో రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 64.46 శాతం నమోదైనట్లు, మరికొన్ని స్థానాల్లో ఇంకా ఓటింగ్ జరుగుతున్నట్లు బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి వినోద్ గుంజ్యాల్ చెప్పారు. 73 ఏళ్ల బీహార్ ఎన్నికల చరిత్రలో ఇదే హైయెస్ట్. 2020లో జరిగిన ఎన్నికల్లో మొదటిదశలో నమోదైన దాని కన్నా ఎక్కువ నమోదైంది.
West Bengal: పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) కొనసాగుతున్న సమయంలో, బుర్ద్వాన్ జిల్లాలోని ఒక చెరువులో వందలాది ఆధార్ కార్డులు దొరికాయి.
Bihar Elections: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ గురువారం జరుగుతోంది. అయితే, రాష్ట్రంలోని లఖిసరై జిల్లాలో పోలింగ్ రోజున ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కాన్వాయ్‌పై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో, ఆవు పేడతో, చెప్పులతో దాడులు చేశారు.
మైథిలి ఠాకూర్.. జానపద గాయని. అనూహ్యంగా ఈ ఏడాది రాజకీయ ప్రవేశం చేశారు. అలీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆర్జేడీ అధికారంలో ఉన్న సమయంలో కుటుంబం ఢిల్లీకి మకాం మార్చింది. అప్పటి నుంచి బీహార్‌తో అంతంత మాత్రంగానే సంబంధాలు ఉన్నాయి. ఇక మైథిలి ఠాకూర్‌కు సొంత ప్రాంతంలో కాకుండా అలీనగర్ సీటును బీజేపీ కేటాయించింది.
BJP Leader: అమెరికా న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ (34) ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌కు కాబోతున్న మొదటి ముస్లిం మేయర్‌గా మమ్దానీ చరిత్ర సృష్టించారు. దీని తర్వాత, ముంబై బీజేపీ చీఫ్ అమీత్ సతం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ మేము ఏ ఖాన్‌ను ముంబై మేయర్‌గా అనుమతించం’’ అని అన్నారు. ఓట్ జిహాద్ ద్వారా న్యూ్యార్క్ నగరంలో కనిపించే విధంగా ముంబైకి రాజకీయాలు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ శుభవార్త. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్ధినీ, విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో కరీంనగర్ జిల్లాలో…
Bihar elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్ కు ఒక రోజు ముందు జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి బీజేపీలో చేరారు. గురువారం బీహార్‌లో మొదటి విడుత ఓటింగ్ జరబోతోంది. దీనికి ఒక్క రోజు ముందే ప్రశాంత్ కిషోర్‌కు ఆయన పార్టీ అభ్యర్థి ఝలక్ ఇచ్చారు. ముంగేర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తు సంజయ్ సింగ్ బుధవారం బీజేపీలో చేరారు. ముంగేర్ బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ సమక్షంలో బీజేపీ సభ్యత్వాన్ని…