ప్రజల కోర్కెలు తీర్చడంలో… ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, అభివృద్ధి విషయంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ, వైసీపీ పార్టీలపై విమర్శల దాడులకు దిగారు. రెండు పార్టీలు కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాయలసీమలో ఎర్రచందనం, ముగ్గురాయి, చాలా ఖనిజాలు ఉన్నప్పటికీ.. ఇక్కడివారు ముఖ్యమంత్రులుగా ఉన్నా అభివృద్ధి లేకుండా చేశారన్నారు. అన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్నా అభివృద్ధి శూన్యమన్నారు. 2024లో బీజేపీ…
రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్, మోడీ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అశు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అశు ఎర్రబెల్లి గెలుపు కోసం గతంలో పని చేశారన్నారు. ఎర్రబెల్లి గెలిచిన తర్వాత అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లపై మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్‌పై ఒత్తిడి తేకపోవడంతోనే ఎర్రెబెల్లిపై విసిగిపోయార్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…
కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో ఆయన చేపట్టిన దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్ట్, చోటు చేసుకున్న పరిణామాల పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయించింది. ఈ క్రమంలో కరీంనగర్ సీపీ సత్యనారాయణను గత…
తెలంగాణ బీజేపీలో మాజీ ఎమ్మెల్యేలు.. పాత నాయకులు మనుగడ కోసం పోరాటం చేస్తున్నారా? అసమ్మతి గళం వినిపిస్తున్నారా? కావాలనే పక్కన పెడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయా? పాత నేతల రహస్య భేటీలు ఎందుకుగుబులు రేపుతున్నాయి? మనుగడ కోసం మాజీలు రోడ్డెక్కుతున్నారా?గతంలో ఎన్నడు లేని కొత్త సంప్రదాయానికి తెలంగాణ బీజేపీ లో తెరలేచింది. ఒకప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న నేతలు ప్రస్తుతం సోదిలో లేకుండా పోయారు. తమను పట్టించుకోవడం లేదని వారంతా ఒక్కటవుతున్నారు. ఈ సమయంలో నోరు విప్పకపోతే భవిష్యత్…
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో సుజన్‌రాజు కుటుంబ సభ్యులను ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు పరామర్శించారు. సుజన్ రాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని, ఆత్మకూరు ఘటన పై నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సోమువీర్రాజు అన్నారు. హిందూ మనోభావాలు గౌరవించే విధంగా ప్రభుత్వ, పోలీసు ల చర్య ఉండాలని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది రాజకీయ పార్టీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం పునాదులలాంటివన్నారు. పోలీసు, రెవెన్యూ రెండు వ్యవస్థలు గాడి…
బీజేపీపై తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నిత్యం చేస్తున్న నిరాధారమైన ప్రకటనలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్య కళాశాలల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తెలంగాణ బీజేపీ బాధ్యతారాహిత్యమని మంత్రి హరీశ్ ఆరోపణలు చేయడం రాజకీయ దూషణలు నిరాధరమైనవని ఆయన అన్నారు. Read Also:దళితుల ఆలయప్రవేశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: ఎమ్మెల్యే…
రేపటి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు 4 రోజులు రాయలసీమ పర్యటన చేయనున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు కర్నూలు చేరుకున్నారు. రేపు కర్నూల్లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటారు. బనగానపల్లెలోను సోమూవీర్రాజు పర్యటిస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. నంద్యాలలో పోలీసులు అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్త సుజన్ పురోహిత్ కుటుంబాన్ని పరామర్శించనున్న సోము వీర్రాజు. ఎల్లుండి అనంతపురంలో పర్యటిస్తారు. 21న గూడూరులో పోలీసులు అరెస్ట్ చేసిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. 22న ఆత్మకూరు ఘటనపై కర్నూలులో…
వైసీపీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త పోట్లూరి వరప్రసాద్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కుమార్తె శృతిరెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పీవిపీ అనుచరుడు బాలాజీ మరికొందరితో కలిసి డీకే అరుణ కుమార్తె శృతి రెడ్డి ఇంట్లోకి ప్రవేశించి, ఆమె స్వంతగా నిర్మించుకున్న ప్రహరి గోడతో పాటు రేకులను సైతం జేసీబితో ధ్వంసం చేయించారు. అంతేకాకుండా శృతిరెడ్డిని బెదిరింపులకు గురి చేసినట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పీవిపీతోపాటు సంఘటన స్థలంలో ఉన్న బాలాజీ…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. సీఎం వాక్సిన్ తీసుకున్నాడో లేదో తెలియదని, వాక్సిన్ తీసుకొమ్మని చెప్పడు, బీజేపీ ఒత్తిడితో గాంధీ హాస్పిటల్‌కి పోయిండు అని ఆయన అన్నారు. టైమ్ పాస్ కోసం కేబినెట్ మీటింగ్ పెట్టిండని, 317 జీఓపై కేబినెట్ లో చర్చించక పోవడం దుర్మార్గమని ఆయన అరోపించారు. ఉద్యోగులు వాళ్ల చావు వాళ్ళు చావాలని కేసీఆర్ అనుకుంటున్నాడా అని ఆయన విమర్శించారు. 317 జీఓను సవరింవే వరకు…