Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ (Vishwanath & Sons) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా రిలీజ్ రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న యునానిమస్ ఆదరణతో ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.
సూర్య కెరీర్లోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న చిత్రాల్లో ఒకటిగా ‘విశ్వనాథ్ & సన్స్’ నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో వీకెండ్‌తో పాటు వర్కింగ్ డేస్‌లో కూడా థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటం సినిమా స్టామినాను నిరూపిస్తోంది. తల్లీ-కొడుకుల అనుబంధం, సున్నితమైన భావోద్వేగాలు మరియు వినోదంతో దర్శకుడు వెంకీ అట్లూరి తీర్చిదిద్దిన విధానం కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంజయ్ విశ్వనాథ్ పాత్రలో సూర్య క్లాసిక్ పెర్ఫార్మెన్స్, జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ చిత్రం అతి త్వరలోనే ₹200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సూర్య-వెంకీ అట్లూరి జోడీ అందించిన ఈ ‘హార్ట్‌ఫెల్ట్ బ్లాక్‌బస్టర్’ సరికొత్త రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్ వద్ద తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది.
Also Read
- Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
- Mythology Movie Trend: వరుసగా పురాణాలేనా? ప్రేక్షకులకు విరక్తి తప్పదా.. ఇండస్ట్రీలో కొత్త చర్చ!
- Ashok Selvan: 'కింగ్ 100'లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
- Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!