Bangladesh: భారత్‌తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..
- భారత్, బంగ్లాదేశ్ మధ్య తీస్తానది వివాదం..
- భారత్‌తో సంబంధాలను పణంగా పెడుతున్న బంగ్లా..
- చైనాతో కలిసి తీస్తా నది ప్రాజెక్టును చేపట్టాలని ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: తీస్తా నదీ వివాదం భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల్ని పెంచుతోంది. చైనా సాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో భారత్‌తో స్నేహాన్ని బంగ్లాదేశ్ పణంగా పెట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ వివాదంపై బంగ్లా జలవనరుల శాఖ మంత్రి షాహిదుద్దీన్ చౌదరి మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీయాలని ఢాకా కోరుకోవడం లేదని, అయితే నదీ జలాల విషయంలో బంగ్లాదేశ్ ప్రయోజనాలను కూడా భారత్ పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఢాకాలో జరిగిన సెమినార్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు అవసరాలు ఉన్నట్లే బంగ్లాదేశ్‌కు కూడా ఉన్నాయని అన్నారు. ఈ విషయాన్ని ఒక మిత్రదేశం, మరో మిత్రదేశం ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
తీస్తా నది భారత్‌లోని సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి చేరుతుంది. ఉత్తర బంగ్లాదేశ్ వ్యవసాయం, సాగునీరు, ప్రజల జీవనోపాధికి ఈ నది అత్యంత కీలకం. ఇదే సమయంలో బెంగాల్లో సాగునీరు, ఇతర అవసరాలకు కూడా తీస్తానది కీలకమైన వనరుగా ఉంది.
Also Read
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
- Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
చైనాతో బంగ్లాదేశ్ మైత్రి:
తీస్తా నదికి సంబంధించి మగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టును చైనా సహకారంతో చేపట్టేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వరదలు, నదీ కోత, వేసవిలో నీటి కొరత వంటి సమస్యలను పరిష్కరించాలని ఢాకా భావిస్తోంది. ఉత్తర బంగ్లాదేశ్‌లోని ఐదారు జిల్లాలు ఈ నదిపై భారీ ఆశలు పెట్టుకున్నాయని మంత్రి షాహిదుద్దీన్ అన్నారు. నదీ కోత, వరదలు, నీటి సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ఇది ఎంతో అవసరమని ఆయన చెప్పారు.
అసలు వివాదం ఏంటి..?
తీస్తా నది జలాల పంపిణీ విషయంలో భారత్, బంగ్లా మధ్య దశాబ్ధాలుగా వివాదం ఉంది. 1983లో కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం తీస్తా జలాల్లో 39 శాతం భారత్‌కు, 36 శాతం బంగ్లాదేశ్‌కు కేటాయించాలని ప్రతిపాదించారు. మిగిలిన 25 శాతం నీటిని పంచుకోకుండా ఉంచాలని నిర్ణయించారు. 2011లో కొత్త మధ్యంతర ఒప్పందానికి రెండు దేశాలు ముందుకొచ్చినా, పశ్చిమ బెంగాల్ అభ్యంతరాలతో అది కుదరలేదు. జూన్ నెలలో బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ చైనా పర్యటనకు వెళ్లారు. తీస్తా ప్రాజెక్టుపై సాంకేతిక అధ్యయనం వేగవంతం చేయాలని చైనా నాయకత్వంలో చర్చించారు.
తాజావార్తలు
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!